Bhakshi sisters die in Ahmedabad plane crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం కొన్ని వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఒక్కొక్కరిది ఒక్కో విషాద కథ. ఈ ప్రమాదంలో హీర్ భక్షి, ధీర్ భక్షి అనే  కవల అక్కా, చెళ్లెళ్లు చనిపోయారు. వీరు అహ్మదాబాద్‌కు తమ అమ్మమ్మ పుట్టినరోజున సెలబ్రేట్ చేయడానికి వచ్చారు. 

అహ్మదాబాద్ లో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వారు హీర్ , ధీర్.  ఆ కుటుంబం నుంచి కొంత మంది లండన్ లో స్థిరపడ్డారు. అయితే వారి పెద్దలంటే  అమితమైన గౌరవం. పెద్దలను చూసేందుకు తరచూ వస్తూంటారు. ఏమైనా కుటుంబ కార్యక్రమాలు ఉంటే.. అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. అలా భక్తి ఫ్యామిలీలో ఓ కుటుంబానికి చెందిన కవల పిల్లలు హీర్ , ధీర్. వీరిద్దరికీ అమ్మమ్మ అంటే ఇష్టం.  తమ అమ్మమ్మ  పుట్టినరోజు జరుపుకోవడానికి అహ్మదాబాద్‌కు వచ్చారు. అమ్మమ్మతో ఆనందంగా గడిపారు. పుట్టిన రోజును మర్చిపోలేని విధంగా  జరిపారు. ఇక లండన్ బయలుదేరారు.  

వారు గురువారం, జూన్ 12, 2025న లండన్‌కు తిరిగి వెళ్తుండగా, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ప్రమాదానికి గురైంది. ఈ విమానం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్. అందులోనే వీరిద్దరూ ప్రయాణిస్తూ చనిపోయారు. వీరి కథ  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నీరు పెట్టిస్తోంది.  

 భక్షి కుటుంబం మాత్రమే కాదు.. ఆ విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబం.. కోలుకోలేని  స్థితిలో ఉంది. మాట్లాడలేకపోతున్నారు. మాటలకందని విషాదాన్ని అనుభవిస్తున్నారు.