మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు బిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మూడో త్రైమాసిక ఆదాయ నివేదిక సందర్భంగా ప్రకటించారు. Facebook నెలవారీ వినియోగదారుల సంఖ్య దగ్గరికి ఇన్‌స్టాగ్రాం నెలవారీ వినియోగదారుల సంఖ్య వస్తుందన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇప్పుడు రెండు బిలియన్ల కంటే ఎక్కువ రోజువారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉందని జుకర్‌బర్గ్ తెలిపారు.
"3.7 బిలియన్ల మంది ప్రజలు ఇప్పుడు నెలవారీ మెటా యాప్‌లలో ఒకదాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్న వారి సంఖ్య అత్యధికం. ఇన్‌స్టాగ్రామ్‌లో నెలవారీ 2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్‌లో 2 బిలియన్లకు పైగా రోజువారీ యాక్టివ్ యూజర్లు ఉన్నాయి." అని త్రైమాసిక ఆదాయ నివేదికను ప్రకటిస్తూ జుకర్‌బర్గ్ చెప్పారు.
మెటా సంస్థ, దాని కుటుంబ యాప్‌ల ఆదాయాల నివేదికలో నెలవారీ 3.7 బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవడంతో మొత్తం మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. "మా కమ్యూనిటీ ఈ త్రైమాసికంలో వృద్ధి చెందుతూనే ఉంది. ఇప్పుడు ఃమా యాప్‌ల కుటుంబంలో నెలవారీగా 3.7 బిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులను చేరుకుంటున్నాం." అని జుకర్‌బర్గ్ వివరించారు.
"మా వ్యాపారం పరంగా, స్థిరమైన కరెన్సీ ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో మొత్తం రాబడి కొద్దిగా పెరిగింది. నేను ఉండాలనుకుంటున్న చోట ఇంకా వెనుకబడి ఉన్నాము, అయితే వచ్చే ఏడాది ఆరోగ్యకరమైన ఆదాయ వృద్ధి ధోరణులకు తిరిగి వస్తామని నమ్ముతున్నాం. ఆర్థిక వ్యవస్థ ఇంకా స్థిరీకరించబడిందని స్పష్టంగా తెలియలేదు కాబట్టి మేము మా బడ్జెట్‌ను కొంత సంప్రదాయబద్ధంగా ప్లాన్ చేస్తున్నాం.” అని కంపెనీ సీఈవో పేర్కొన్నారు.
ముందుగా 2018 జూన్‌లో, ఇన్‌స్టాగ్రామ్ ఒక బిలియన్ నెలవారీ యూజర్లను అధిగమించిందని కంపెనీ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ చాలా ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. అందులో టిక్‌టాక్ తరహా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కీలకపాత్ర పోషించాయి.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?