iPhone Vs Android : ఆండ్రాయిడ్ యూజర్లతో పోలిస్తే ఐఫోన్ యూజర్లు ఉబెర్ కు ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతన్నాయి. ఒకే ట్రిప్ కోసం రెండు ఫోన్‌లలో వేర్వేరు ధరలుండడంపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న స్ర్కీన్ షాట్స్ ప్రకారం, ఆండ్రాయిడ్ ఫోన్ లో రూ. 290.79 ధర ఉంటేగా, ఐఫోన్ అదే ట్రిప్‌కు రూ. 342.47గా కనిపించింది. సుధీర్ అనే సోషల్ మీడియా యూజర్ షేర్ చేసిన పోస్ట్ ఈ అసమానతలను ప్రశ్నించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ పోస్ట్ నెటిజన్లను ఆలోచించేలా చేసింది. వారు కూడా ఈ పోస్ట్ కి అంగీకరించారు. తమక్కూడా అలానే అవుతుందన్నారు. కొన్నిసార్లు రెండు ఫోన్లలో రూ.30 -50 కంటే ఎక్కువ తేడా ఉండడం లేదని కొందరు చెప్పారు. మొదటగా ఈ పోస్ట్ లోని అసలైన ఫొటోను లింక్డ్‌ఇన్‌లో వ్యవస్థాపకుడు నిరాలీ పరేఖ్ షేర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సమస్యను మరోసారి హైలైట్ చేయడానికి తాను దాన్ని మళ్లీ పోస్ట్ చేశానని సుధీర్ స్పష్టం చేశాడు.
ఉబెర్ ఏం చెప్పిందంటే..
ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఫోన్లలో ఛార్జీల్లో తేడాలపై ఉబెర్ స్పందించింది. ఉపయోగించిన ఫోన్ రకం ఆధారంగా ఉబెర్ ఛార్జీలు విధించదని స్పష్టం చేసింది. బుక్ చేసుకునే టైం, దూరం, డిమాండ్ ను బట్టి ఛార్జీలుంటాయని చెప్పింది. “ఈ రెండు రైడ్‌లలోని అనేక వ్యత్యాసాలు ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ అభ్యర్థనలపై పికప్ పాయింట్, ETA, డ్రాప్-ఆఫ్ పాయింట్ మారుతూ ఉంటాయి. దీని వల్ల రెండు ఫోన్ల రకాలలో వివిధ ఛార్జీలు ఉంటాయి. రైడర్ సెల్ ఫోన్ తయారీదారు ఆధారంగా ఉబెర్ ట్రిప్ ధరలను వ్యక్తిగతీకరించదు" అని రైడ్-హెయిలింగ్ యాప్ తెలిపింది.
iPhone Vs Android: అసలైన తేడాలివే
స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తోన్న వాళ్లలో ఐఫోన్ యూజర్ల కంటే ఆండ్రాయిడ్ యూజర్లే ఎక్కువ. ఎందుకంటే ఐఫోన్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. మరికొందరేమో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఫ్రెండ్లీ యూజర్ గా ఉంటాయి. అంతే కాకుండా ఆండ్రాయిడ్ యూజర్లతో పోలిస్తే ఐఫోన్ యూజర్లు యాప్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లు, ప్రీమియం సర్వీస్ లపై ఎక్కువ ఖర్చు చేస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సైన్స్-టెక్ టుడే ప్రకారం, ఐఫోన్ యూజర్లు ఒక్కో యాప్‌కు సగటున 12.77 డాలర్లు అంటే రూ. 1,087 చెల్లిస్తారు. అయితే ఆండ్రాయిడ్ యూజర్లు 6.19 డాలర్లు అంటే రూ. 527 ఖర్చు చేస్తారు. ఆండ్రాయిడ్ (Android)పరికరాల కోసం 0.43 డాలర్లు అంటే రూ. 36తో పోల్చితే, యాప్‌లో కొనుగోళ్లు కూడా ఐఫోన్ (iPhone)లకు 1.07 డాలర్లు అంటే రూ. 91 వద్ద ఎక్కువగా ఉన్నాయి. ఈ తరహా తేడాలు ఐఓఎస్ (iOS) యూజర్స్ కోసం కంపెనీలు అధిక ధరలను నిర్ణయించవచ్చనే ఊహాగానాలకు దారితీసింది. అయితే ఈ ఆరోపణలపై ప్రస్తుతానికైతే ఎలాంటి స్పష్టతా లేదు.
Also Read : BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!