How To Download EPIC Card In Online: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండగా, తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థలు సైతం ఓటర్లలో అవేర్నెస్ కలిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ముందుగా ఓటర్ల లిస్టులో తమ పేరు ఉందో? లేదో? తెలుసుకోవాలి. ఓటరు కార్డును తప్పకుండా తీసుకెళ్లాలి. ఓటరు కార్డుతో పాటు ‘e-EPIC’ కార్డును కూడా పోలింగ్ స్టేషన్ కు తీసుకెళ్లాలి. దీనిని ఆన్ లైన్ నుంచి ఈజీగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.


ఇంతకీ  ‘e-EPIC’ కార్డు అంటే ఏంటి?


‘e-EPIC’ కార్డు అనేది ఓటరు గుర్తింపు కార్డుకు డిజిటల్ వెర్షన్ గా చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే ప్రత్యేకమైన నెంబర్ ను ‘EPIC’ నెంబర్ అంటారు. ఈ ‘EPIC’ నెంబర్ తోనే ఓటరు కార్డు డిజిటల్ కాపీని పొందే అవకాశం ఉంటుంది. ఈ నెంబర్ ను ఉపయోగించి ఫోన్ లో లేదంటే కంప్యూటర్ లో ‘e-EPIC’ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనిని ప్రింట్ తీసుకుని పోలింగ్ స్టేషన్ కు వెళ్లి అక్కడి సిబ్బందికి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.  


‘e-EPIC’ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే?  


ఆన్ లైన్ లో  ‘e-EPIC’ కార్డును ఈజీగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.ttps://voters.eci.gov.in/ అనే వెబ్ సైట్ లింకును ఓపెన్ చేసి, కొన్ని స్టెప్స్ ఫాలో అయితే, ‘e-EPIC’ కార్డును పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..   


‘e-EPIC’ కార్డు డౌన్ లోడ్ కు ఈ స్టెప్స్ ఫాలోకండి


1. ‘e-EPIC’ కార్డు కోసం http://voterportal.eci.gov.in/ లేదంటే https://nvsp.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.   


2. ఈ వెబ్ సైట్ లో ముందుగా లాగిన్ కావాలి.   


3. మెనులోని డౌన్‌లోడ్  ‘e-EPIC’ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.   


4. ఆ తర్వాత ఎపిక్ నంబర్ లేదంటే మీ ఫోన్ నెంబర్ ను యాడ్ చేయాలి.


5. రిజిస్టర్డ్ మోబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని సైట్ లో ఎంటర్ చేయాలి.


6. ఆ తర్వాత  ‘e-EPIC’ కార్డు కనిపిస్తుంది.


7. చివరలో ‘e-EPIC’ కార్డు డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్నిక్లిక్ చేయడం వల్ల ‘e-EPIC’ డౌన్ లోడ్ అవుతుంది.


8. డౌన్ లోడ్ అయిన  ‘e-EPIC’ కార్డును ప్రింట్ తీసుకుని, ఓటర్ ఐడీతో కలిపి పోలింగ్ సెంటర్ కు వెళ్లి మీ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.


Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!