రోజు రోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పెరిగిపోతోంది. ఇప్పటికే ఆటో మోబైల్, టెలీ కమ్యూనికేషన్ సహా పలు రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మ్యాన్ పవర్ తగ్గి, యాంత్రీకరణ పెరిగిపోయింది. దీంతో అదనపు ఉత్పత్తి లభిస్తోంది. ఇక తాజాగా మీడియా రంగంలోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చేరింది. ఇప్పటి వరకు విదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా న్యూస్ చదివే యాంకర్లు చూశాం. ఈ మధ్యే ఇండియాలోనూ ఈ ట్రెండ్ మొదలయ్యింది. ఇప్పటికే కొన్ని జాతీయ చానెళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రెజెంటర్స్ ను పరిచయం చేశాయి. ఇక ప్రస్తుతం రీజినల్ చానెల్స్ లోనూ AI ప్రెజెంటర్ రాక మొదలయ్యింది.
ఒడిశాలో ఫస్ట్ AI న్యూస్ ప్రెజెంటర్
తాజాగా ఒడిశాలో ఓ న్యూస్ ఛానెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రెజెంటర్ తో వార్తలు చదివి అందరినీ ఆశ్చర్య పరిచింది. భువనేశ్వర్‌కు చెందిన ఒడిశా టెలివిజన్ నెట్‌వర్క్(OTV)యాజమాన్యం ఈ AI యాంకర్‌కు లిసాగా నామకరణం చేసింది. ఈ న్యూస్ యాంకర్ ఒడిశాలోని ప్రైవేట్ ఛానెల్ లో అచ్చ భారతీయ మహిళగా కనిపిస్తూ వార్తలు చదివింది. ఒడిశా సంప్రదాయ చేనేత చీర ధరించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రెజెంటర్ ఇంగ్లీష్ తో పాటు ఒరియాలో వార్తలు వినిపించింది. అచ్చంగా అమ్మాయి మాదిరిగానే కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. వార్తలు చదివేది అమ్మాయి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రెజెంటర్ అని తెలుసుకుని ప్రేక్షకులు షాక్ అయ్యారు.
ఒరియా, ఇంగ్లీష్ లో వార్తలు చదువుతున్న లిసా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెజెంటర్ పేరు లిసా టీవీతో పాటు, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లలో ప్రధాన యాంకర్‌గా వ్యవహరిస్తుందని OTV యాజమాన్యం వెల్లడించింది. టీవీ బ్రాడ్ కాస్టింగ్, జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ యాంకర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. లిసా ప్రపంచంలోని అన్ని భాషలను పలుకుతుందని వెల్లడించింది. అయితే, ప్రస్తుతం లీసా ఒరియా, ఇంగ్లీషులో మాత్రమే వార్తలు చదువుతందని తెలిపింది. ఇక లిసా పేరుతో OTV యాజమాన్యం సోషల్ మీడియాలో అకౌంట్లు కూడా ఓపెన్ చేసింది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెజెంటర్ హవా పెరుగుతుందని OTV యాజమాన్యం తెలిపింది.
“ఒరియాలో లిసాకు శిక్షణ ఇవ్వడం చాలా పెద్ద పని అయినా, మేము చేసి చూపించామని OTV డిజిటల్ బిజినెస్ హెడ్ లితీషా మంగత్ పాండా వెల్లడించారు. మేము ఇంకా లిసాకు శిక్షణ ఇస్తూనే ఉన్నాం. ఈ న్యూస్ ప్రెజెంటర్ ఇతరులతో సులభంగా సంభాషించగలిగే స్థాయికి తీసుకురావాలి అని భావిస్తున్నాం” అన్నారు.
OTV గురించి..
OTV భువనేశ్వర్‌కు చెందిన ఒడిషా టెలివిజన్ నెట్‌వర్క్ యాజమాన్యంలో కొనసాగుతోంది. జాగి మంగత్ పాండా ఈ చానెల్ ను ప్రారంభించింది. ఒడిషా టెలివిజన్ ఒడిషా రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇది 1997లో జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ లో ప్రసారాలను ప్రారంభించింది. ఆ తర్వాత నెమ్మదిగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలకు విస్తరించింది. డిసెంబర్ 2006లో కేబుల్ నుంచిశాటిలైట్ ఛానెల్‌గా మార్చబడింది.
Read Also: రామ్ పోతినేనితో పూరీ కొత్త సినిమా షురూ- అట్టహాసం ‘డబుల్ ఇస్మార్ట్’ లాంచ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial