Lava Blaze Curve 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ - లావా బ్లేజ్ కర్వ్ 5జీ వచ్చేసింది!

Lava New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త ఫోన్ లావా బ్లేజ్ కర్వ్ 5జీని మనదేశంలో లాంచ్ చేసింది.

Continues below advertisement

Lava Blaze Curve 5G Launched: లావా బ్లేజ్ కర్వ్ 5జీ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 6.67 అంగుళాల 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది. డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉన్న స్పీకర్లను ఇందులో అందించారు. లావా బ్లేజ్ కర్వ్ 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

Continues below advertisement

లావా బ్లేజ్ కర్వ్ 5జీ ధర (Lava Blaze Curve 5G Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.17,999గానూ, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.18,999గానూ నిర్ణయించారు. ఐరన్ గ్లాస్, విరిడియన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, లావా ఈ-స్టోర్, ఇతర రిటైల్ అవుట్ లెట్లలో మార్చి 11వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది.

లావా బ్లేజ్ కర్వ్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Lava Blaze Curve 5G Specifications)
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14కు దీన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్, హెచ్‌డీఆర్10+, వైడ్‌వైన్ ఎల్1లను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్ అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7059 ప్రాసెసర్‌పై లావా బ్లేజ్ కర్వ్ 5జీ రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్‌ను అందించారు. ర్యామ్‌ను వర్చువల్ ఫీచర్ ద్వారా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 128 జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

5జీ, 4జీ, బ్లూటూత్ వీ5.2, ఎఫ్ఎం రేడియో, వైఫై, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లతో ఇది రానుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు దీనికి సెక్యూరిటీని అందిస్తాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 183 గ్రాములుగా ఉంది.

Continues below advertisement