Sivaji in Alitho Saradaga: ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత హీరోగా ప్రేక్షకులను అలరించిన శివాజీ.. చాలాకాలం వరకు వెండితెరకు దూరమయ్యారు. అనుకోకుండా బిగ్ బాస్ రియాలిటీ షోలో కనిపించి అందరికీ షాకిచ్చారు. ఇక ఆ రియాలిటీ షో అయిపోగానే ‘#90s’ అనే వెబ్ సిరీస్‌తో మళ్లీ యాక్టింగ్‌లో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ సిరీస్‌తో మరోసారి శివాజీ అంటే ఏంటో అందరికీ గుర్తుచేశారు. అప్పటినుండి బుల్లితెరపై పలు ఇంటర్వ్యూలో కనిపిస్తూ మళ్లీ యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆలీ హోస్ట్‌గా చేస్తున్న ‘ఆలీతో సరదాగా’ సీజన్ 2లో గెస్టుగా వచ్చారు శివాజీ. అందులో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


వెబ్ సిరీస్ అవకాశం ఎలా వచ్చిందంటే.?


వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో హీరో ఫ్రెండ్స్‌గా ఆలీ, శివాజీ కలిసి నటించారు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ‘ఆలీతో సరదాగా’ స్టేజ్‌పై వీరిద్దరూ కలవడంతో మళ్లీ ఆ సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ కోసం ట్రైన్‌లో పలాచీ వెళ్తున్న సమయంలోనే ఒక వ్యక్తి శివాజీకి మందు పోశాడని బయటపెట్టారు. ఆ విషయం గుర్తుచేసుకొని ఆలీ, శివాజీ నవ్వుకున్నారు. ఇక ఇన్నాళ్లు యాక్టింగ్‌కు దూరంగా ఉన్న శివాజీ.. ‘#90s’ అనే వెబ్ సిరీస్ ఛాన్స్ ఎలా వచ్చింది అని ఆలీ ప్రశ్నించగా.. అసలు తను యాక్టింగ్ చేయడానికి, రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణాలు ఏంటో శివాజీ చెప్పుకొచ్చారు.


నిజంగా కూతురు ఉందా.?


‘‘ఒకరోజు బాపినీడు గారిని కలుద్దామనిపించింది. ఈ అవకాశం వచ్చింది ఎలా అని అడిగాను. అది చేయి, ఆపొద్దు అన్నారు. ఆ ఒక్క వెబ్ సిరీస్‌కు 5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు’’ అంటూ ‘#90s’లో తాను ఎందుకు నటించాడో చెప్తూ.. అది అంత పెద్ద హిట్ అవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇక శివాజీకి ఇద్దరూ అబ్బాయిలే ఉన్నా.. కూతురు కూడా ఉందని అప్పుడప్పుడు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తుంటాయి. అసలు దాని వెనుక కథేంటి అని ఆలీ అడిగారు. ‘‘కూతురు ఉందని టాక్ ఎందుకు వచ్చిందో.. ఎక్కడైనా ఉంటే తెచ్చిస్తే హ్యాపీగా పెంచుకుంటా నేను’’ అని కామెడీగా సమాధానమిచ్చారు శివాజీ. ఇక శివాజీ పెళ్లి ఫోటోను చూసి ‘‘మీ నాన్న నన్ను వద్దన్నాడు కదా అని ఎక్స్‌ప్రెషన్ కదా’’ అని జోక్ చేశారు ఆలీ.


అప్పటివరకు చెప్పులు లేవు..


అసలు తను ఊరి నుండి వచ్చేయడానికి కారణమేంటి అని ఆలీ అడిగారు. ‘‘చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. పాపం నాన్న నన్ను చదివించడానికి కష్టపడ్డారు. వ్యవసాయంలో పెద్దగా ఏమీ మిగలదు. బ్రతకడానికే అప్పులు చేయాలి. అంతకు మించి రైతుకు ఏముండదు. అలాంటి పరిస్థితుల్లో జీవితం అంటే ఏంటో అర్థమయ్యింది. బాధ్యత తీసుకోవాలని సిద్ధపడి హైదరాబాద్ వచ్చాను. నేను మళ్లీ ఊరెళితే కారు కొనుక్కునే వెళ్లాలని ఫిక్స్ అయ్యాను. నర్సరావుపేట వెళ్లి 9వ తరగతి చదవాలి అన్నప్పుడు చెప్పులు కొన్నారు’’ అని అప్పటి కష్టాలను గుర్తుచేసుకున్నారు శివాజీ. వేషం మార్చి తిరగడమేంటి అని ఆలీ ప్రశ్నించగా.. ‘‘వేషం మార్చి దుబాయ్‌లో దొరికిపోయిన శివాజీ అని రాశారు. ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే రాజకీయం చేయాలి’’ అని తన జీవితం గురించి మరెన్నో ఆసక్తికర విషయాలను ‘ఆలీతో సరదాగా’లో పంచుకున్నారని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.



Also Read: పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్‌ సింగర్‌ - ప్రియుడిని పరిచయం చేసిన హారికా