చాలా మంది కొత్త ఫోన్లను కొనాలంటే ముందు బ్యాటరీ కెపాసిటీని చెక్ చేస్తారు. ఇక ప్రస్తుత గేమింగ్ యుగంలో అయితే ప్రతి ఒక్కరూ తమ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు తక్కువ ధరలోనే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలైతే ఏకంగా గేమింగ్ కోసమే ప్రత్యేకంగా ఫోన్లను రూపొందిస్తున్నాయి. ఈ ఏడాది భారత మార్కెట్‌లోకి చాలా స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో బెస్ట్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్లు ఏవి.. అందులో ఉన్న ఫీచర్లేంటి? వంటి వివరాలు మీకోసం..
ఇన్‌ఫీనిక్స్ హాట్ 10 ఎస్ (Infinix Hot 10S)
ఇన్‌ఫీనిక్స్ హాట్ 10 ఎస్.. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కెపాసిటీతో మార్కెట్‌లోకి విడుదల అయింది. దీనికి 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. రూ.10,999 ధరలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 6.82 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంటుంది. దీనికి 1640×720 పిక్సెల్స్ రిజల్యూషన్ అందించారు. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మొరాండీ గ్రీన్, హార్ట్ ఆఫ్ ఓషియన్, బ్లాక్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎక్స్ఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీనికి ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. ప్రైమరీ కెమెరా 49 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఏఐ కెమెరాలను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62..
7000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 ధర రూ. 19,999గా ఉంది. ఇది 6జీబీ, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.7 అంగుళాల సూపర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. క్వాడ్ రేర్ కెమెరా సెటప్ అందించారు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లను అందించారు. ఎక్సినోస్ 9825 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
పోకో ఎం3 ప్రో 5జీ..
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1080x2400 పిక్సెల్స్) హోల్ పంచ్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అందించారు. దీనిని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. వెనక వైపు మూడు కెమెరాలను అందించారు. ప్రైమరీ కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని ధర రూ.15,999గా ఉంది. కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో రంగుల్లో ఇది లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22..
6000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.12,499గా ఉంది. దీనికి 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంది. ఇందులో 6.4 అంగుళాల హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. రిజల్యూషన్ 1640×720 పిక్సెల్స్ గా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా దీనిని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ప్రైమరీ కెమెరా కెపాసిటీ 48 మెగాపిక్సెల్స్ గా ఉంది. దీంతో పాటు సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు.
టెక్నో స్పార్క్ 7టీ..
రూ.10 వేల ధరలో భారీ బ్యాటరీ కెపాసిటీతో ఉన్న స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న టెక్నో స్పార్క్ 7టీ ధర రూ.9,299 మాత్రమే. దీనిలో 6.52 అంగుళాల ఐపీఎస్ హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. మీడియాటెక్ హీలియో జీ 35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో లభిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా దీనిని పెంచుకోవచ్చు. 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. గేమ్స్ బాగా ఆడేవారికి ఇదో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అని చెప్పవచ్చు.