జులై 31 శనివారం రాశిఫలాలు 

మేషంమీ నైపుణ్యంతో పనులను సులభంగా పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యలు ఉంటాయి.  ఎవరితోనూ వివాదం వద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు అనుకూల సమయం. విద్యార్థులు సానుకూల ప్రయోజనాలు పొందుతారు.

వృషభంకొత్త పనికోసం వేసుకున్న ప్రణాళిక అమలుచేస్తారు. ఈరోజు మీకు అదృష్టం బావుంటుంది. కొన్ని కారణాల వల్ల కలతచెందుతారు. స్నేహితుల సహాయంలో కొన్ని పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిధునంమిధునరాశివారు కోపం తగ్గించుకోండి. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు మరింత కష్టపడక తప్పదు. అనసవర ఖర్చులు నియంత్రించండి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. కొత్త ప్రణాళికలు వేసేటప్పుడు, కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల అభిప్రాయాలు తీసుకోండి. 

కర్కాటక రాశిఈ రోజు మీరు బంధువులను కలుస్తారు. మీరు ఆస్తి సంబంధిత తగాదాలుంటాయి. మొండితనం చూపొద్దు. జీవిత భాగస్వామితో సామరస్యంగా వ్యవహరిస్తారు. ఊహించని ఖర్చులు చేస్తారు. కొత్తపరిచయాలు ఏర్పడతాయి. 

సింహంసింహం రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. కొత్తపనులు ప్రారంభిస్తారు. అపరిచితుల విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మానసిక ప్రశాంతంత లభిస్తుంది. ఇంట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు....ఆరోగ్యం జాగ్రత్త. 

కన్యకొత్త పరిచయాలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో ఉత్సాహంగా ఉంటారు.  ఇతరులకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు. ధనం దుర్వినియోగం చేయొద్దు. 

తులారాశితులారాశివారు ఈ రోజు కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థికంగా నష్టపోతారు. ఏ సమయంలో అయినా నింద పడాల్సి వస్తుంది. కారణం లేకుండా ప్రయాణం చేయొద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

వృశ్చికరాశివృశ్చికరాశి వారు శుభవార్త వింటారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం శుభపలితాలనిస్తుంది. అదృష్టం కలిసొస్తుంది.  విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేరు. మీకు, కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలుంటాయి. ఖర్చులు అధికమవుతాయి. 

ధనుస్సుధనస్సు రాశివారి ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. సామాజిక సేవ చేసే అవకాశం మీకు వస్తుంది. మనస్సులో ప్రతికూల భావాల కారణంగా...మీ దృష్టి తప్పు దిశలో వెళ్లొచ్చు. పెద్దల పట్ల గౌరవంగా ఉంటూ..వారి మాట వింటే శుభఫలితాలు పొందుతారు. ఈ రోజు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

మకరంఈ రోజు మీ పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కార్యాలయంలో బాధ్యత పెరుగుతుంది. మద్యపానం మానేయండి. సోమరితనం మిమ్మల్ని వెంటాడుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమను పొందుతారు. 

కుంభంకుంభరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలుకు ఇదే మంచి అవకాశం. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. చేసే పనిలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు నిరాశపడే ఫలితాలు పొందుతారు.ప్రణాళికలు రూపొందించడానికి ఈరోజు మంచిరోజు కాదు. 

మీనంమీనరాశివారికి ఈ రోజు శ్రమ అధికం అవుతుంది. అకాస్మాత్తుగా వివాదం ఉండొచ్చు. ఈ రోజు మీకు మిశ్రమ రోజు అవుతుంది. కుటుంబ సభ్యుడు విజయం సాధిస్తారు. అకస్మాత్తుగా వివాదం ఉండవచ్చు. దూషించే పదాలను ఉపయోగించవద్దు. ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీపై కొన్ని అభియోగాలు ఉండొచ్చు.