దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ నెట్ వర్క్ ఉపయోగిస్తున్న వినియోగదారులు తమకు సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. బ్రాడ్‌బ్యాండ్, టెలికాం వినియోగదారులు ఇద్దరికీ... ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంటర్నెట్ అవుటేజ్ ట్రాకర్ డౌన్‌డిటెక్టర్ కూడా గుర్తించింది. మనదేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వినియోగదారులు ఇంటర్నెట్ సమస్యల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు.


అయితే ఎయిర్‌టెల్ ఈ విషయంపై ఇంతవరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఎయిర్ టెల్ బ్రాడ్‌బ్యాండ్ మాత్రమే కాకుండా... మొబైల్ నెట్‌వర్క్‌లకు కూడా ఈ సమస్య ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎయిర్ టెల్ యాప్ కూడా కొందరు వినియోగదారులకు ఓపెన్ కావట్లేదని ఫిర్యాదు చేస్తున్నారు.