షియోమీ తన కొత్త ల్యాప్‌టాప్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే షియోమీ బుక్ ప్రో 2022. ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాలు, 16 అంగుళాల వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌ల్లో ఈ4 ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను కంపెనీ అందించింది.
షియోమీ బుక్ ప్రో 2022 ధర
ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల ఐ5 వేరియంట్ ధరను 6,799 యువాన్లుగా (సుమారు రూ.80,000) నిర్ణయించారు. ఐ7 వేరియంట్ ధర 8,499 యువాన్లుగా (సుమారు రూ.1,00,000) ఉంది. ఇక 16 అంగుళాల మోడల్లో ఐ5 మోడల్ ధరను 7,399 యువాన్లుగానూ (సుమారు రూ.87,000), ఐ7 వేరియంట్ ధరను 9,399 యువాన్లుగానూ (సుమారు రూ.1,10,700) నిర్ణయించారు. ఈ ల్యాప్‌టాప్ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ కానుంది.
షియోమీ బుక్ ప్రో 2022 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాలు, 16 అంగుళాల వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ఈ4 ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ల్యాప్‌టాప్‌లూ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నాయి. 14 అంగుళాల వేరియంట్‌లో 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, 16 అంగుళాల వేరియంట్‌లో 60 హెర్ట్జ్ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 2880×1800 పిక్సెల్స్ కాగా, యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఇంటెల్ పీ-సిరీస్ 12వ తరం ప్రాసెసర్లను వీటిలో అందించారు. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 100W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి.
షియోమీ ల్యాప్‌టాప్‌లకు మనదేశంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇది త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!