డెల్ జీ15 5525 గేమింగ్ ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో ఏఎండీ రైజెన్ 6000హెచ్ సిరీస్ ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు ఎన్‌వీడియా గ్రాఫిక్స్ ప్రాసెసర్ కూడా ఉండనుంది. మొత్తంగా ఐదు వేర్వేరు కాన్పిగరేషన్లలో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. ఇందులో మంచి గేమింగ్ సెంట్రిక్ ఫీచర్లను కూడా అందించారు. గేమ్ షిఫ్ట్ ఫంక్షన్ ద్వారా డైనమిక్ పెర్ఫార్మెన్స్ మోడ్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్‌లో యాక్టివేట్ చేయవచ్చు.


డెల్ జీ15 5525 ధర
డెల్ జీ15 5525లో మొత్తం ఐదు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్లను బట్టి రూ.83,990 నుంచి రూ.1,27,990 మధ్య ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ అధికారిక వెబ్ సైట్, డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, లార్జ్ ఫార్మాట్ రిటైలర్లు, మల్టీ బ్రాండ్ అవుట్ లెట్లలో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు.


డెల్ జీ15 5525 ఫీచర్లు
డెల్ జీ15 5525లో 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... పీక్ బ్రైట్ నెస్ 250 నిట్స్‌గా ఉంది. అన్ని వేరియంట్లలోనూ దీని డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. దీని బేస్ వేరియంట్లో ఏఎండీ రెమ్‌బ్రాండ్ట్ ఆర్5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్, ఎన్వీడియా ఆర్టీఎక్స్ 3050 4 జీబీ జీపీయూని అందించారు.


ఇక మూడో మోడల్లో దాదాపు సేమ్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి కానీ కొత్త ప్రాసెసర్‌ను అందించారు. ఏఎండీ రెమ్‌బ్రాండ్డ్ ఆర్7 ప్రాసెసర్ ఇందులో ఉంది. ఎన్వీడియా ఆర్టీఎక్స్ 3050 టీఐ జీపీయూని కూడా అందించారు. చివరిగా ఐదో వేరియంట్లో మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది.


కొత్త డెల్ జీ15 5525 ల్యాప్‌టాప్‌లో ఏలియన్ వేర్ ఇన్‌స్పైర్డ్ థర్మల్ డిజైన్‌ను అందించారు. ఎయిర్ ఇన్ టేక్, అల్ట్రా థిన్ ఫ్యాన్ బ్లేడ్స్, కాపర్ పైప్స్, ఫోర్ వెంట్స్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. ఫ్యాన్ స్పీడ్ పెంచడానికి ఏలియన్ వేర్ కమాండ్ కూడా అందించారు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!