టెక్నో తన మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను ఐఎఫ్ఏ 2022 బెర్లిన్ ఈవెంట్లో లాంచ్ చేసింది. అదే టెక్నో మెగాబుక్ టీ1. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 16 జీబీ వరకు ర్యామ్, 70Whr బ్యాటరీతో ఈ ల్యాప్‌టాప్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా 17.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. షాంపేన్ గోల్డ్, మోనెట్ వయొలెట్, రోమ్ మింట్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. అయితే త్వరలో మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
టెక్నో మెగాబుక్ టీ1 స్పెసిఫికేషన్లు
టెక్నో మెగాబుక్ టీ1 ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల స్క్రీన్‌ను అందించారు. టీయూవీ రెయిన్‌ల్యాండ్ ఐ కంఫర్ట్ సర్టిఫికేషన్, అడాప్టివ్ డీసీ డిమ్మింగ్ వంటి ఫీచర్లు కూడా అందించారు. 350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది.
12 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్ ఆప్షన్లతో టెక్నో మెగాబుక్ టీ1 మార్కెట్లోకి వచ్చింది. 512 జీబీ ఎస్ఎస్‌డీ, 1 టీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఆప్షన్లు కూడా ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉంది. ముందువైపు వీడియో కాలింగ్ కోసం 2 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 65W ఫాస్ట్ చార్జర్‌ను కూడా దీంతోపాటు అందించారు.
ఒక హెచ్‌డీఎంఐ పోర్టు, రెండు యూఎస్‌బీ 3.0 పోర్టులు, వైఫై 6, టీఎఫ్ కార్డ్ రీడర్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. దీని మందం 1.48 సెంటీమీటర్లు కాగా, బరువు 1.48 కేజీలుగా ఉంది.
టెక్నో మనదేశంలో స్పార్క్ 9టీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న దీని ధరను రూ.9,799గా నిర్ణయించారు. టర్కోయిస్ సియాన్, అట్లాంటిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో టెక్నో స్పార్క్ 9టీని కొనుగోలు చేయవచ్చు.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ357 ప్రాసెసర్ కూడా ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. స్టోరేజ్‌లో నుంచి 3 జీబీని వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే 7 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లుగా ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!