అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 17 స్పెషల్ ఎడిషన్ ల్యాప్ టాప్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో 12వ తరం ఇంటెల్ కోర్ ఐ9 హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్లను అందించారు. 17.3 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 16:9గానూ ఉండనుంది. 32 జీబీ వరకు డీడీఆర్5 ర్యామ్ ఇందులో ఉండనుంది. దీన్ని 64 జీబీ వరకు పెంచుకోవచ్చు.


అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 17 ఎస్ఈ ధర
దీని ధరను మనదేశంలో రూ.3,59,990గా నిర్ణయించారు. అసుస్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. క్రోమా, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్‌లో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. హైఎండ్‌లో మంచి గేమింగ్ ల్యాప్‌టాప్ కావాలనుకుంటే ఇదే బెస్ట్.


అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 17 ఎస్ఈ స్పెసిఫికేషన్లు
ఇందులో 17.3 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,440x2,560 పిక్సెల్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 16:9గానూ, రిఫ్రెష్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ సపోర్ట్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. 12వ తరం ఇంటెల్ కోర్ ఐ9 హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్లపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది.


32 జీబీ వరకు డీడీఆర్5 ర్యామ్ ఈ ల్యాప్‌టాప్‌లో ఉంది. అదనంగా ఉన్న రెండు ర్యామ్ స్లాట్ల ద్వారా 64 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. 4 టీబీ పీసీఎల్ఈ జెన్ 4 ఎస్ఎస్‌డీ స్టోరేజ్ కూడా అందించారు. వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2 ఫీచర్లను అసుస్ రోగ్ స్ట్రిక్ స్కార్ 17 ఎస్ఈ సపోర్ట్ చేయనుంది. డాల్బీ అట్మాస్, స్మార్ట్ యాంప్లిఫయర్ టెక్నాలజీ, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు ఉన్న నాలుగు స్పీకర్ల సెటప్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో ఉంది.


అసుస్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో యూవీ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. యూఎస్‌బీ టైప్-ఏ 3.2 జెన్ 1 పోర్టులు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌లు ల్యాప్‌టాప్‌కు ఎడమవైపు ఉన్నాయి. కుడివైపు కీస్టోన్ కీ అందించారు. వెనకవైపు థండర్ బోల్ట్ 4 పోర్టు, యూఎస్‌బీ టైప్-సీ 3.2 జెన్ 2 పోర్టు, ఎథర్ నెట్ పోర్టు, హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు అందించారు. దీని మందం 2.83 సెంటీమీటర్లు కాగా, బరువు మూడు కేజీలుగా ఉంది.


అసుస్ జెన్‌ఫోన్ 9 యూరోపియన్ మార్కెట్లలో ఇటీవలే లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 799 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.64,800) నుంచి ప్రారంభం కానుంది. మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుంది.


ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120 హెర్ట్జ్ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా అసుస్ జెన్‌ఫోన్ 9లో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై అసుస్ జెన్ ఫోన్ 9 పనిచేయనుంది.


ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సిక్స్-యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా, 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!