సాధారణంగా ఫోన్ లోని వివరాలను బయటి వారు చూడకుండా ఉండేలా.. అందరూ పాస్ వర్డ్ పెట్టుకుంటారు. చైనా ఫోన్ నుంచి ఐఫోన్ వరకూ అంతా ఇదే పద్దతిని పాటిస్తున్నారు. కానీ, ఈ ఫాస్ వర్డ్స్ ను చాలా మంది కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి ఈజీగా బ్రేక్ చేస్తున్నారు. ఆయా ఫోన్లలోని రహస్యాలను చూస్తున్నారు. ఒక్కోసారి కీలక సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ఫోన్లు, కంప్యూటర్లు పాస్ వర్డ్ తో కాకుండా పాస్ కీలతో లాగిన్ అయ్యే టెక్నాలజీని రూపొందిస్తున్నది. హ్యాకర్-బస్టింగ్ ప్లాట్ పేరుతో దీన్ని త్వరలో ప్రారంభించబోతుంది.
పాస్ వర్డ్స్ పూర్తి రక్షణ కాదు
ఆశ్యర్యంగా అనిపించినా, పాస్ వర్డ్స్ అనేవి వినియోగదారుల డేటాకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. పాస్ వర్డ్స్ వైఫల్యాల గురించి సైబర్ సెక్యూరిటీ నిపుణులు సంవత్సరాలుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. సాధారణ పాస్ వర్డ్‌లను సులభంగా ఊహించవచ్చు. సంక్లిష్టమైన వాటిని కూడా హ్యాక్ చేయవచ్చు. అయితే ఆపిల్ మునుపెన్నడూ లేని సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేబోతున్నది. Apple iPhone కోసం iOS 16లో పాస్ వర్డ్ లేని లాగిన్‌లను, Mac కోసం MacOS వెంచురాను పెట్టనున్నట్లు ప్రకటించింది.
ఎవరూ బ్రేక్ చేయలేని విధంగా లాగిన్
జూన్‌లో జరిగిన Apple WWDC-2022 ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించినా.. సెప్టెంబరులో ఆ టెక్నాలజీని ఇంఫ్లిమెంట్ చేయబోతున్నది. పాస్ వర్డ్ కు బదులుగా పాస్‌కీలను ఉపయోగించి వినియోగదారులు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినది డిజిటల్ కీ ఉపయోగించి లాగిన్ అవుతారు. మీరు iPhone లేదంటే Macలో మీ వేలిముద్ర (టచ్ ID) లేదంటే ముఖం (Face ID) చూపించి ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది అత్యంత త్వరగా లాగ్ ఇన్ చేయడానికి వీలుంటుంది. అంతేకాదు.. మీరు ఊహించలేని, బ్రేక్ చేయలేని లాగిన్‌ని కలిగి ఉంటారు.
పాస్‌వర్డ్ లేని సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్న గూగుల్, మైక్రోసాఫ్ట్
మీ పాస్‌కీలు మీ ఫోన్ లేదంటే మాక్ లో ఉంచుతారు. Apple iCloud కీచైన్‌ని ఉపయోగించి మల్టీఫుల్ గాడ్జెట్‌లలో సింక్ అవుతాయి. దీని ద్వారా పాస్‌వర్డ్‌లను ట్రాక్ చేయవచ్చు. కానీ ఇప్పటికీ పాస్ కీలను యాపిల్ సహా ఎవరూ చదవలేరు. అంతేకాదు.. ఫిషింగ్ ద్వారా పాస్‌వర్డ్‌ను ట్రాక్ చేయలేరు. Windows ల్యాప్ టాప్ లు, Android ఫోన్‌లతో సహా Apple-యేతర పరికరాలలో కూడా పాస్‌కీలతో లాగిన్ అయ్యేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ రెండు సంవత్సరాలుగా పాస్‌వర్డ్ లేని సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నాయి.
ఈ నెలలోనే అందుబాటులోకి కొత్త టెక్నాలజీ
కొత్త iOS 16 సెప్టెంబర్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తునట్లు యాపిల్ ప్రకటించింది. ప్రస్తుతం పాస్ కీ టెక్నాలజీ టెస్టింగ్ జరుపుకుంటున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు iOS 16 పబ్లిక్ బీటాలో చేరవచ్చని తెలిపింది. iOS 16 పూర్తి ఆవిష్కరణ జరిగిన అనంతరం, దాన్ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. పాస్ కీ ప్రమాదకరమైన హ్యాక్ దాడుల నుంచి మిమ్మల్ని రక్షించగలుగుతుందని వెల్లడించింది. అంతేకాదు.. ఒక్కో సర్వీసుకు ఒక్కో పాస్ కీ పెట్టుకునే అవకాశం ఉందని ఆపిల్ తెలిపింది.