ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసిన సంవత్సరం తర్వాత నథింగ్ ఫోన్ (1)ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నథింగ్ ల్యాప్‌టాప్‌లు కూడా త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో కార్ల్ పెయ్ అధికారికంగా ప్రకటించారు.


కంపెనీ వేర్వరు కాన్సెప్ట్‌లపై దృష్టి పెట్టినప్పటికీ దాని ఫోకస్ ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ తయారీ పైనే ఉందని కార్ల్ పెయ్ తెలిపారు. అయితే ఇప్పట్లో కాకపోయినా త్వరలో అయినా మనం నథింగ్ ల్యాప్‌టాప్‌ను చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న సేల్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ ఆఫర్‌ను అందించారు.


నథింగ్ ఫోన్ 1 ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ సేల్ ధర, ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 1 ప్రస్తుతం రూ.29,999కే అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,000 తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొంటే అదనంగా మరో రూ.2,750 తగ్గించనున్నారు. అంటే మొత్తంగా రూ.3,750 తగ్గనుందన్న మాట. దీంతో ఈ ఫోన్ రూ.26,249కే లభించనుంది. ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.3,000 తగ్గింపును అందించనున్నారు.


నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ‌ఇందులో అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 


12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఫీచర్లు అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ ఉండగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరా ఉంది.


డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మూడు మైక్రోఫోన్లు నథింగ్ ఫోన్ 1లో ఉన్నాయి. ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అందించనున్నట్లు నథింగ్ లాంచ్ సమయంలో ప్రకటించింది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?