Infinix InBook X1 Slim: రూ.30 వేలలోపే సూపర్ ల్యాప్‌టాప్ - 11 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు!

ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 మనదేశంలో లాంచ్ అయింది.

Continues below advertisement

ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో 14 అంగుళాల డిస్‌ప్లే, 10వ తరం ప్రాసెసర్, 50డబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించనున్నారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్‌ను కంపెనీ ఇందులో అందించడం విశేషం.

Continues below advertisement

ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ ధర
ఈ ల్యాప్‌టాప్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐ3 + 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990గా నిర్ణయించారు. ఐ3 + 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,990గా ఉంది. ఇక ఐ5 + 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,990గానూ, ఐ5 + 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,990గా నిర్ణయించారు.

గ్రే, బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ వేరియంట్లలో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు. జూన్ 21వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది. యాక్సిస్ బ్యాంక్ ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు తగ్గింపు లభించనుంది.

ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ ఫీచర్లు
ఫుల్ మెటల్ బాడీ, అల్యూమినియం అలోయ్‌తో దీన్ని రూపొందించారు. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని పిక్సెల్ రిజల్యూషన్ 1920 x 1080 పిక్సెల్స్‌గా ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 16:9 కాగా, 10వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు ఇందులో ఉన్నాయి. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. బ్యాటరీ విషయానికి వస్తే... ఇందులో 50 డబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేయనుంది. 11 గంటల బ్రౌజింగ్, 11 గంటల వెబ్ బ్రౌజింగ్, 9 గంటల రెగ్యులర్ వర్క్, 9 గంటల వీడియో ప్లేబ్యాక్ లభించనుంది. ఈ ల్యాప్‌టాప్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 90 నిమిషాల సమయం పట్టనుంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Continues below advertisement