HP Envy X360: ఐమ్యాక్స్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసిన హెచ్‌పీ - టచ్ స్క్రీన్‌తో పాటు ఇంకా ఎన్నో ఫీచర్లు - ధర ఎంతంటే?

హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది.

Continues below advertisement

హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 15 సిరీస్ ల్యాప్‌టాప్‌లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో 15.6 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఉంది. ఇంటెల్, ఏఎండీ రైజెన్ ప్రాసెసర్లతో ఈ ల్యాప్‌టాప్ వచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇవి అందించనున్నాయి. వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐమ్యాక్స్ ఎన్‌హేన్స్‌డ్ డిస్‌ప్లే సర్టిఫికేషన్‌తో హెచ్‌పీ లాంచ్ చేసిన మొదటి ల్యాప్‌టాప్‌లు ఇవే. అంటే ఇవి ఐమ్యాక్స్ ఫార్మాట్ సినిమాలను, సీన్లను మరింత ఎక్కువ యాస్పెక్ట్ రేషియోతో ఈ ల్యాప్‌టాప్‌ల్లో చూడవచ్చు.

Continues below advertisement

హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 సిరీస్ ధర
దీని ధర మనదేశంలో రూ.78,999 నుంచి ప్రారంభం కానుంది. హెచ్‌పీ ఆన్‌లైన్ స్టోర్, హెచ్‌పీ వరల్డ్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రాసెసర్, స్టోరేజ్, వేరియంట్‌ను బట్టి దీని ధర మారుతూ ఉంటుంది. 

హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐమ్యాక్స్ ఎన్‌హేన్స్‌డ్ డిస్‌ప్లేతో హెచ్‌పీ లాంచ్ చేసిన హెచ్‌పీ లాంచ్ చేసిన మొదటి సిరీస్ ల్యాప్‌టాప్‌లు ఇవే. 13వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఏఎండీ రైజెన్ 7000 సిరీస్ ప్రాసెసర్లు ఇందులో ఉన్నాయి. ఎన్వీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 ఆర్టీఎక్స్ 3050 లేదా ఏఎండీ రేడియోన్ గ్రాఫిక్స్ కార్డులు కూడా అందించారు. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ అందుబాటులో ఉంది.

ఈ సిరీస్‌లో 15.6 అంగుళాల ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఐసేఫ్ సర్టిఫికేషన్ ఫీచర్ కూడా ఈ టీవీలో ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో కూడా ఇందులో ఉంది. 5 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా ఈ ల్యాప్‌టాప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, మీటింగ్‌లకు అటెండ్ అవ్వవచ్చు.

ఫిజికల్ ఎమోజీ మెనూ కూడా హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 సిరీస్‌లో అందించారు. హెచ్‌పీ క్విక్‌డ్రాప్ టెక్నాలజీ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో ఉంది. బ్లూటూత్ 5.3, వైఫై 6ఈ సపోర్ట్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ పెడితే 15 గంటల బ్యాకప్‌ను ఈ ల్యాప్‌టాప్ అందించనుంది. కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ ఎక్కనుంది.

Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement