Laptop Battery Life Tips: ల్యాప్‌టాప్‌పై ఎక్కువ సమయం పని చేస్తున్న వారు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యే ఇది. పదే పదే ఛార్జింగ్ డౌన్‌ అవుతుందని ఛార్జింగ్‌లో ఉంచే పని చేస్తుంటారు. "ఇలా చేయడం వల్ల ల్యాప్‌టాప్ పాడవుతుందా?" అనే ప్రశ్న మీ మనసులో తప్పకుండా వస్తుంది. నిపుణులు దీని గురించి ఏమంటున్నారో, ఈ అలవాటు ల్యాప్‌టాప్ బ్యాటరీ, పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

ఛార్జింగ్‌లో పని చేయడం సురక్షితమేనా?సాధారణంగా, ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో పెట్టి ఉపయోగించడం ప్రమాదకరం కాదు. నేడు వస్తున్న లేటెస్ట్ ల్యాప్‌టాప్‌లు స్మార్ట్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఇవి ఓవర్‌ ఛార్జింగ్ నుంచి రక్షణ పొందగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అంటే, బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, ఛార్జింగ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అప్పుడు ల్యాప్‌ట్యాప్‌ నేరుగా AC పవర్ నుంచి పని చేయడం ప్రారంభిస్తుంది.

బ్యాటరీపై ఎప్పుడు ప్రభావం ఉంటుంది?  మీరు ల్యాప్‌టాప్‌ను నిరంతరం ఛార్జింగ్‌లో పెట్టి ఉపయోగిస్తే మాత్రం కచ్చితంగా ప్రభావం ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం నెమ్మదిగా తగ్గుతుంది. అంటే బ్యాటరీ పూర్తిగా పాడవుతుందని కాదు, కానీ దాని పనితీరులో కొంచెం తేడా రావచ్చు. ముఖ్యంగా మీరు వీడియో ఎడిటింగ్ లేదా గేమింగ్ వంటి చాలా హీటింగ్ పనుల కోసం ల్యాప్‌టాప్‌ ఉపయోగిస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంటుంది. అలా హీటెక్కడం వల్ల బ్యాటరీ లైఫ్‌ స్పాన్ తగ్గిపోతుంది.  

బ్యాటరీ లైఫ్‌ కోసం ఏమి చేయాలి?

  • బ్యాటరీని సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు అనుసరించవచ్చు:
  • ఎల్లప్పుడూ బ్యాటరీని పూర్తిగా అయిపోక ముందు ఛార్జ్ చేయండి.
  • ల్యాప్‌ట్యాప్‌ హీటెక్కినప్పుడు కొంత సమయం పాటు ఆఫ్ చేయండి.
  • ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పాటు ప్లగ్ ఇన్ మోడ్‌లో మాత్రమే ఉపయోగిస్తుంటే, అప్పుడప్పుడు బ్యాటరీపై కూడా ఉపయోగించండి. అంటే ఛార్జింగ్ తీసేసే వాడాల్సి ఉంటుంది. 

నిపుణుల అభిప్రాయం

ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో ఉపయోగించడం పూర్తిగా సురక్షితమని టెక్ నిపుణులు చెబుతున్నారు. కానీ బ్యాటరీ పనితీరు ఎక్కువ కాలం పాటు సురక్షితంగా ఉండాలంటే  బ్యాలెన్స్‌ పాటించాలి. అంటే, ఎల్లప్పుడూ ఛార్జింగ్‌లో ఉంచవద్దు. అలా అని చెప్పి బ్యాటరీ పూర్తిగా డెడ్ అయ్యే వరకు ఎదురు చూడొద్దు. అది కూడా బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతుంది.  

ఫలితం ఏమిటి?మొత్తంమీద, ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో పెట్టి పని చేయడం ఏ విధంగానూ హానికరం కాదు, కానీ కొంచెం తెలివిగా ఉంటూ ఉపయోగించడం అవసరం. మీరు కొన్ని సాధారణ విషయాలు గుర్తుంచుకుంటే, మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ కూడా ఎక్కువ కాలం బాగా  పని చేస్తుంది. పనితీరు కూడా బాగుంటుంది.