యాపిల్ కొత్త మ్యాక్‌బుక్ డివైస్‌లను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. సప్లయర్లు కూడా తర్వాత లాంచ్ కాబోయే ల్యాప్‌టాప్‌ల షిప్‌మెంట్ల కోసం సిద్ధం అవుతున్నారు. డిజిటైమ్స్ కథనం ప్రకారం యాపిల్ కొత్త మ్యాక్‌బుక్‌లను అక్టోబర్‌లో లాంచ్ చేయనుంది. సాధారణంగా యాపిల్ కొత్త ఉత్పత్తులను అక్టోబర్‌లోనే మార్కెట్లోకి తీసుకువస్తుంది.
15 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్, 12 అంగుళాల డివైస్‌ను 2024 ప్రారంభంలో యాపిల్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. 5 నానోమీటర్ చిప్స్‌తో కొత్త మ్యాక్‌బుక్ ప్రోను యాపిల్ తీసుకువచ్చే అవకాశం ఉంది. 14 అంగుళాలు, 16 అంగుళాల మోడల్స్‌లో ఎం2 ప్రో, ఎం2 మ్యాక్స్ చిప్‌లు ఉండనున్నాయి.
మ్యాక్ మినీ కూడా ఈ సంవత్సరమే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఐమ్యాక్, ఐమ్యాక్ ప్రోను కూడా యాపిల్ రూపొందిస్తుంది కానీ అవి వచ్చే సంవత్సరం రానున్నాయని సమాచారం. యాపిల్ తన మొట్టమొదటి మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను రివీల్ చేయనుందని తెలుస్తోంది.
ఏ14 ప్రాసెసర్‌తో 10వ తరం ఐప్యాడ్‌ను యాపిల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఐప్యాడ్ ప్రో తరహాలోనే ఫ్లాట్‌గా దీని డిజైన్ ఉండనుంది. ఐఫోన్ X తరహాలో వర్టికల్ కెమెరా లెన్స్ ఉన్న రెండర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
యాపిల్ ఐప్యాడ్ ప్రో కూడా ఎం2 చిప్‌తో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లలో ఎం1 చిప్‌ను అందించారు. దీన్ని కూడా అప్‌గ్రేడ్ చేయనున్నారు. మినీ ఎల్ఈడీ ఉన్న మ్యాగ్ సేఫ్ వైర్‌లెస్ చార్జింగ్‌ను ఈ ఐప్యాడ్ ప్రో సపోర్ట్ చేయనుంది.
ఈ సంవత్సరం మార్చిలో జరిగిన ఈవెంట్లో మ్యాక్ స్టూడియో, స్టూడియో డిస్‌ప్లేలను యాపిల్ లాంచ్ చేసింది. ఈమనదేశంలో మ్యాక్ స్టూడియో ధర రూ.1,89,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎం1 మ్యాక్స్ ప్రాసెసర్, 32 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఒకవేళ ఎం1 అల్ట్రా ప్రాసెసర్ కావాలనుకుంటే... ఇందులో 64 జీబీ ర్యామ్, 1 టీబీ ఎస్ఎస్‌డీ ఉండనుంది. దీని ధర రూ.3,89,900గా నిర్ణయించారు. యాపిల్ స్టూడియో డిస్‌ప్లే స్టాండర్డ్ గ్లాస్ వేరియంట్ ధరను రూ.1,59,900గానూ, నానో టెక్చర్ గ్లాస్ వేరియంట్ ధరను రూ.1,89,900గానూ నిర్ణయించారు.
మ్యాక్ స్టూడియో స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే... గతంలో లాంచ్ అయిన మ్యాక్ ప్రో కంటే దీని సైజు కొంచెం చిన్నగా ఉండనుంది. దీన్ని అల్యూమినియంతో రూపొందించారు. పైభాగంలో యాపిల్ లోగో ఉంది. యూఎస్‌బీ టైప్-సీ, థండర్ బోల్డ్ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. ఇక ముందువైపు ఎస్‌డీఎక్స్‌సీ కార్డు స్లాట్ కూడా ఉంది. 32 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఎం1 అల్ట్రా ప్రాసెసర్‌లో 20 సీపీయూ కోర్లు, 64 జీపీయూ కోర్లు అందించారు. 128 జీబీ వరకు ర్యామ్, 8 టీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌ను టాప్ ఎండ్ వేరియంట్‌లో అందించారు. దీని ధర మనదేశంలో రూ.7,89,900గా నిర్ణయించారు.
యాపిల్ స్టూడియో డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు
ఈ డిస్‌ప్లే సైజు 27 అంగుళాలుగా ఉంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 5కేగా ఉంది. ట్రూ టోన్ కలర్ అడ్జస్ట్ మెంట్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఇది ట్రూ 10-బిట్ కలర్‌ను సపోర్ట్ చేయనుంది. ఇందులో ఏ13 ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఇందులో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను అందించారు.డాల్బీ అట్మాస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
ఇందులో 10 జీబీపీఎస్ యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను అందించారు. దీంతోపాటు థండర్‌బోల్ట్ పోర్టు కూడా ఇందులో ఉండనుంది. టచ్ ఐడీ, మ్యాజిక్ హౌస్, మ్యాజిక్ ట్రాక్‌ప్యాడ్ వంటి ఆప్షన్లు ఉన్న యాపిల్ మ్యాజిక్ కీబోర్డు కూడా లాంచ్ అయింది. దీని ధరను రూ.19,500గా నిర్ణయించారు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?