JioBharat J1 4G Launched: జియో భారత్ జే1 4జీ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. 4జీ కనెక్టివిటీ ఉన్న ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్‌గా ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. ఇది ఒక బడ్జెట్ ఫోన్. జియో ప్రత్యేకంగా అందించే జియో భారత్ ప్లాన్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ఇందులో ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా రావడం విశేషం. ఫోన్ వెనకవైపు కెమెరా యూనిట్‌ను కూడా అందించారు. దీనికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే మనదేశంలో ప్రారంభం అయింది. 2023 అక్టోబర్‌లో లాంచ్ అయిన జియో భారత్ బీ1 4జీతో ఇది జాయిన్ అయింది.


జియో భారత్ జే1 4జీ ధర (JioBharat J1 4G Price in India)
ఈ ఫోన్ ప్రస్తుతానికి అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీన్ని రూ.1,799కే కొనుగోలు చేయవచ్చు. డార్క్ గ్రే కలర్ ఆప్షన్‌లో జియో భారత్ జే1 4జీ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్‌పై ప్రస్తుతానికి ఎటువంటి కార్డు ఆఫర్లూ అందుబాటులో లేవు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


జియో భారత్ జే1 4జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (JioBharat J1 4G Specifications)
ఇందులో 2.8 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఫిజికల్ కీప్యాడ్, డెడికేటెడ్ నేవిగేషన్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. సాధారణ కీప్యాడ్ ఫోన్లలో ఉండే కాల్ ఆన్సర్, రిజెక్ట్ బటన్లు (పచ్చ బటన్, ఎర్ర బటన్) ఇందులో కూడా చూడవచ్చు. థ్రెడ్ఎక్స్ ఆర్టీఓఎస్ అనే ప్రత్యేకమైన ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. 0.13 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.


రూ.123 4జీ రీఛార్జ్ ప్లాన్‌ను జియో ప్రత్యేకంగా తీసుకువచ్చింది. దీని ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్, నెలకు 14 జీబీ డేటా లభించనుంది. ప్రీ-ఇన్‌స్టాల్డ్ జియో టీవీ యాప్‌లో పలు స్థానిక ఛానెళ్లు సహా 455కు పైగా ఛానెల్స్ యాక్సెస్ చేయవచ్చు. జియోపే యాప్ ద్వారా యూపీఐ లావాదేవీలను సులభంగా చేయవచ్చు.


జియో భారత్ జే1 4జీ మొబైల్‌లో 2500 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ అందించింది. 3.5 ఎంఎం ఆడియో జాక్ ద్వారా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీని మందం 1.6 సెంటీమీటర్లు కాగా, బరువు 122 గ్రాములుగా ఉంది. ఫోన్ వెనకవైపు డిజిటల్ కెమెరా యూనిట్ కూడా ఉంది. కెమెరా యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్స్ కూడా చేయవచ్చు. 



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?