Jio vs Airtel vs Vi vs BSNL: 2024 సంవత్సరం ముగియడానికి మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మీరు కూడా కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు చవకైన రీఛార్జ్‌ని పొందాలని ఆలోచిస్తున్నట్లయితే అటువంటి రీఛార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని వల్ల మీరు చాలా కాలం పాటు మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.


ఇటువంటి రీఛార్జ్ ప్లాన్‌లను రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్నాయి. ఇవి వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లు. వీటితో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీరు ఏడాది పొడవునా రీఛార్జ్ నుంచి బయటపడవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


సంవత్సరం వాలిడిటీతో జియో రీఛార్జ్ ప్లాన్‌లు
జియో 336, 365 రోజుల చెల్లుబాటుతో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. 336 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ. 895. ఈ ప్లాన్‌తో మొత్తం 24 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 50 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. జియో అందిస్తున్న ఒక సంవత్సరం ప్లాన్ రూ. 3,599గా ఉంది. ఇది ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో జియో యాప్‌ల ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.


ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 365 రోజుల ప్లాన్
ఎయిర్‌టెల్, వొడాఫోన్ రెండూ 365 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌లను అందిస్తున్నాయి. వీటిలో చవకైన సంవత్సరం ప్లాన్ ధర రూ. 1999గా ఉంది. రెండు కంపెనీలు 24 జీబీ హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాన్ని అందిస్తాయి.


బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ రూ.2,999కి వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ 4జీ నెట్‌వర్క్ హై స్పీడ్ ఇంటర్నెట్ సపోర్ట్‌తో పాటు ప్రతిరోజూ 3 జీబీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు మీరు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం పొందుతారు.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?