Jio Vs Airtel: దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది కస్టమర్లు రిలయన్స్ జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయ్యారు. రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ 2022 అక్టోబర్‌లో జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. ఇప్పుడు తొమ్మిది కోట్ల మందికి పైగా 5జీ కస్టమర్లు చేరాక జియో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ సర్వీస్ రోల్‌అవుట్‌ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


మొత్తం కస్టమర్ల సంఖ్య 47 కోట్లు
జియో ట్రూ 5జీ తొమ్మిది కోట్ల మంది కస్టమర్‌లతో సహా రిలయన్స్ జియో మొత్తం కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 47 కోట్లకు దాటిపోయింది. జియో నెట్‌వర్క్‌లో ఇంటర్నెట్ డేటా వినియోగం 31.5 శాతం పెరిగి 38.1 బిలియన్ జీబీకి చేరుకుందని కంపెనీ తెలిపింది. ఇది కాకుండా రిలయన్స్ జియో మొత్తం డేటా ట్రాఫిక్‌లో నాలుగో వంతు ఇప్పుడు జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌కు మారిందని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం 9 బిలియన్ జీబీ కంటే ఎక్కువ డేటా ట్రాఫిక్ లోడ్ ఇప్పుడు జియో 5జీ నెట్‌వర్క్‌పై పడింది. ఇది కాకుండా ఇప్పుడు రిలయన్స్ జియోలో కాలింగ్ సమయం 1.37 ట్రిలియన్ నిమిషాలకు పెరిగిందని కంపెనీ పేర్కొంది.


ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ, ‘జియో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ రోల్‌అవుట్‌ను పూర్తి చేసింది. ఇప్పుడు భారతదేశం అంతటా అందుబాటులో ఉంది. జియో ఎయిర్‌ఫైబర్‌కు కస్టమర్‌లు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు.’ అని ఆయన అన్నారు. ‘జియో ఎయిర్ ఫైబర్ ముఖ్యంగా టైర్ 3, 4 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ప్రారంభాన్ని కలిగి ఉంది.’ అని తెలిపారు.


ఎంత లాభం?
ఇది కాకుండా ఇప్పుడు కంపెనీ నికర లాభం రూ.5,445 కోట్లకు పెరిగిందని రిలయన్స్ జియో తన నివేదిక ద్వారా తెలిపింది. కంపెనీకి నెలకు ఒక్కో కస్టమర్‌కు వచ్చే సగటు ఆదాయంలో పెద్దగా పెరుగుదల లేనప్పటికీ 5జీ నెట్‌వర్క్‌కు ఉచిత పరీక్ష చేయడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ సర్వీసు ద్వారా వినియోగదారుల నుంచి ఎక్కువ ఆదాయం రాదన్న మాట.


మరోవైపు మోటో జీ ప్లే (2024) స్మార్ట్ ఫోన్ ఇటీవలే అమెరికాలో లాంచ్ అయింది. ఇంతకు ముందు మార్కెట్లో లాంచ్ అయిన మోటో జీ ప్లే (2023)కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు చాలా వరకు అప్‌గ్రేడ్స్ కూడా చేయడం విశేషం. మోటో జీ ప్లే (2024) క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై రన్ కానుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో అందించారు. దీని వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ల ద్వారా మంచిగా ఫొటోలు దిగవచ్చు.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!