Jio Recharge Plan: చవకైన రీఛార్జ్ ప్లాన్ల గురించి చెప్పాలంటే రిలయన్స్ జియో ఎల్లప్పుడూ ప్రజల మొదటి ఎంపిక. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ జియోకు 49 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కంపెనీ తక్కువ ధర నుంచి ప్రీమియం వరకు అన్ని రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. మీరు జియో సిమ్‌ని కూడా ఉపయోగించే వారయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది.


జియో ఇటీవల ఒక మంచి రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా మీరు మూడు నెలల కంటే ఎక్కువ వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది లాంగ్ వ్యాలిడిటీని ఇవ్వడమే కాకుండా ఇంటర్నెట్, కాలింగ్, వినోదం కోసం చాలా ప్రయోజనాలను అందిస్తుంది.


రిలయన్స్ జియో రూ.999 ప్లాన్
వ్యాలిడిటీ: ఈ ప్లాన్‌లో మీరు 98 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.
కాలింగ్: అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత ఉచిత కాలింగ్ లభిస్తుంది.
డేటా: ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ మొబైల్ డేటా లభిస్తుంది. అంటే మొత్తంగా 196 జీబీ డేటా లభిస్తుందన్న మాట. 


ఈ ప్లాన్ ట్రూ 5జీ ప్లాన్‌లో భాగం అని చెప్పవచ్చు. దీనిలో మీరు అన్‌లిమిటెడ్ 5జీ డేటాకు కూడా యాక్సెస్ పొందుతారు. అయితే 5జీ డేటా లభిస్తుందా లేదా అన్నది మీ ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుందా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. కానీ రేట్లు పెంచిన కారణంగా జియో నుంచి కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌కు షిఫ్ట్ అయిపోతున్నారు.



Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!


ఓటీటీ బెనిఫిట్స్ కూడా...
జియో ఈ ప్లాన్‌లో ఓటీటీ, ఇతర సౌకర్యాలను కూడా అందిస్తుంది.


జియో సినిమా: జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంను ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు.
జియో టీవీ: లైవ్ టీవీ, ఇతర కంటెంట్‌కు ఉచిత సభ్యత్వం లభిస్తుంది.
జియో క్లౌడ్: క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం కూడా ఇందులో అందుబాటులో ఉంది.


ఈ ప్లాన్ ఎందుకు స్పెషల్?
మీకు లాంగ్ వాలిడిటీ, హై స్పీడ్ డేటాతో కూడిన పూర్తి వినోద ప్యాకేజీ కావాలంటే జియో అందిస్తున్న రూ.999 ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, కాలింగ్‌లను ఎలాంటి అంతరాయం లేకుండా ఆనందించవచ్చు. ఒకసారి రీఛార్జ్ చేయడం ద్వారా ఎక్కువ కాలం టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.



Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!