Registration Fee Exempted For Electric Vehicles In Telangana: తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాహనాలకు (Electric Vehicles) రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష మిగులుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సోమవారం నుంచి కొత్త ఈవీ పాలసీ వస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవీ పాలసీ వివరాలను మంత్రి వెల్లడించారు. 'రాష్ట్రంలో రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చాం. గతంలో 2020-2030  ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారు. జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. టూవీలర్స్, ఆటో, ట్రాన్స్‌పోర్ట్ బస్సులకు 100 శాతం పన్ను మినహాయింపు. జంట నగరాల్లో ఈవీ బస్సులు తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు తెచ్చాం.' అని పేర్కొన్నారు.


'ఈవీలకు ప్రాధాన్యత ఇవ్వాలి'


కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)  తెలిపారు. 'హైదరాబాద్‌లో ఇప్పుడున్న 3 వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సిటీలో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. తెలంగాణ ప్రజలు ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాహనాలు 15 ఏళ్లు దాటిన వాటికి స్క్రాప్ చేయాలని పాలసీ తెచ్చాం. వాహన సారథిలో కూడా 29 రాష్ట్రాల్లో తెలంగాణ చేరుతుంది. వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలి. రోడ్ సేఫ్టీపై గురువారెడ్డి సంస్థ లైసెన్స్ ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది.


యునిసెఫ్ ద్వారా స్కూళ్లలో రోడ్డు అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. రవాణా శాఖకు కొత్త లోగో వస్తుంది. కొత్త వాహనాలు వస్తున్నాయి. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటున్నాయి. ఈవీ కంపెనీలు చొరవ తీసుకొని ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. ఇప్పటివరకూ 1.70 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వచ్చే 10 రోజుల్లో రవాణా శాఖ, జీహెచ్ఎంసీ, hmda, హైదరాబాద్ పోలీసులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తాం. పొల్యూషన్ చెకప్ చేసే వాహనాలు సరిగా చేయడం లేదనే ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ తీసుకొస్తున్నాం. ఇప్పటికే రవాణా శాఖలో కానిస్టేబుల్స్, AMVIల నియామకం జరిగింది. అర్హులందరికీ ప్రమోషన్లు కల్పిస్తాం. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ కంపెనీ బాధ్యత. ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడైనా ఒకటి ప్రమాదం జరిగితే ప్రజల మధ్య అపోహ సృష్టించద్దు.' అని పొన్నం పేర్కొన్నారు.


Also Read: Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్