Jio OTT Recharge Plans: మనకు నచ్చిన వెబ్ సిరీస్‌లు, షోలు లేదా సినిమాలను చూడటానికి చాలా సార్లు ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో విడిగా రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వినియోగదారులకు చేతి చమురు భారీ మొత్తంలో వదులుతుంది. అయితే జియో దీని నుంచి ఉపశమనం కలిగించే అనేక ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో ఇప్పుడు తన వినియోగదారులకు డజనుకు పైగా OTT సేవలకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.


మీరు ఏకకాలంలో 12 కంటే ఎక్కువ ఓటీటీ సేవలను ఆస్వాదించాలి అనుకుంటే మీరు జియోటీవీ ప్రీమియం ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ డేటాతో పాటు కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పాటు ఓటీటీ ప్లాన్స్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్ రూ. 148 నుంచి ప్రారంభం అవుతుంది. దీంతో పాటు కంపెనీ అదనపు డేటాను కూడా అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను కూడా పొందుతారు.


రూ. 148 ప్లాన్ (Jio Rs 148 Plan)
జియో చవకైన ఓటీటీ ప్లాన్ ధర రూ. 148గా ఉంది. అయితే ఇది డేటా ఓన్లీ ప్లాన్. ఈ ప్లాన్ వినియోగదారులకు 10 జీబీ అదనపు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్‌తో మీరు సోనీలివ్, జీ5 వంటి 12 ఓటీటీ ప్లాట్‌ఫాంలకు యాక్సెస్ లభిస్తుంది.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది 


రూ. 389 ప్లాన్ (Jio Rs 389 Plan)
ఈ ప్లాన్ 28 రోజుల పాటు ప్రతిరోజూ 2 జీబీ డేటాను అందిస్తుంది. దీనితో పాటు అదనంగా మరో 6 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద మీరు సోనీలివ్, జీ5 వంటి 12 ఓటీటీ ప్లాట్‌ఫాంల కంటెంట్ చూడవచ్చు.


రూ. 1198 ప్లాన్ (Jio Rs 1198 Plan)
జియో రూ. 1198 ప్లాన్‌లో కూడా చాలా ఓటీటీ వినోదాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ కింద మీరు 84 రోజుల పాటు ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. దీంతో పాటు 18 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అదే సమయంలో అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ పంపే సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో మీరు ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటి 14 ఓటీటీ ప్లాట్‌ఫాంల కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.


రూ. 4498 ప్లాన్ (Jio Rs 4498 Plan)
ఇది జియో అందిస్తున్న అత్యంత ఖరీదైన ప్లాన్. దీని వాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఇందులో రోజువారీ ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది కాకుండా ప్రతిరోజూ 2 జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటి 14 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను చూడవచ్చు. ఈ ప్లాన్ 78 జీబీ అదనపు డేటాను కూడా అందిస్తోంది.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు