TSTET 2024 Dates: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్ టెట్‌(TS TET)-2024 షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ మే 3న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 20 నుంచి 29 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.


పరీక్ష విధానం: టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.


మాక్ టెస్టులు అందుబాటులో..
టెట్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల సౌకర్యార్దం మాక్ టెస్టులను విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. పరీక్ష సరళిని అంచనా వేయడానికి ఈ మాక్ టెస్టులు ఉపయోగపడతాయి.


మాక్ టెస్టుల కోసం క్లిక్ చేయండి..


TS TET - 2024 పరీక్షల షెడ్యూల్ ఇలా..


➥ మే 20: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)


➥ మే 20: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)


➥ మే 21: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)


➥ మే 21: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)


➥ మే 22: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 1)


➥ మే 22:  పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెష‌న్ 2)


➥ మే 24: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ 1)


➥ మే 24: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)


➥ మే 28: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 1)


➥ మే 28: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)


➥ మే 29:  పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 1)


➥ మే 29: పేప‌ర్-2 సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ 2)


➥ మే 30: పేప‌ర్-1 (సెష‌న్ 1)


➥ మే 30: పేప‌ర్-1 (సెష‌న్ 2)


➥ మే 31: పేప‌ర్-1 (సెష‌న్ 1)


➥ మే 31: పేప‌ర్-1 (సెష‌న్ 2)


➥ జూన్ 1: పేప‌ర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ 1)


➥ జూన్ 1: పేప‌ర్-1(మైన‌ర్ మీడియం) (సెష‌న్ 2)


➥ జూన్ 2: పేప‌ర్-1 (సెష‌న్ 1)


➥ జూన్ 2: పేప‌ర్-1 (సెష‌న్ 2)


టెట్‌కు 2.8 లక్షల దరఖాస్తులు..
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)-2024కు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20తో ముగిసింది. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి టెట్ పరీక్షల కోసం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కి 99,210 మంది దరఖాస్తు చేసుకోగా.. పేపర్-2కి 1,84,231 మంది దరఖాస్తులు సమర్పించారు. వాస్తవానికి ఏప్రిల్ 10తో గడువు ముగియాల్సి ఉండగా..  ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 9 సాయంత్రం నాటికి కేవలం టెట్‌కు 1,93,135 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంతో పోల్చితే దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గడువు పొడిగించడంతో 10 రోజుల్లో 90 వేల మంది అభ్యర్థులు అదనంగా దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు గడువుతోపాటు దరఖాస్తుల సవరణ గడువు కూడా ఏప్రిల్ 20తో ముగిసింది. ఏప్రిల్ 11 నుంచి 20 వరకు దరఖాస్తులోని వివరాలను సవరించుకునేందుకు అవకాశం కల్పించగా.. పేపర్-1లో 6,626 మంది, పేపర్-2లో 11,428 మంది అభ్యర్థులు వివరాలను సరిచేసుకున్నారు. 



 


TS TET 2024 Detailed Notification


TS TET 2024 Information Bulletin


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..