Siddharth About Heeramandi: ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ కపుల్‌గా మారిపోయారు సిద్ధార్థ్, అదితి రావు హైదరీ. వీరిద్దరి డేటింగ్ గురించి రూమర్స్ బయటికొచ్చినప్పటి నుండి అసలు వీరు నిజంగానే సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అని చాలామంది ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా ఎవరికీ చెప్పకుండా సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చారు సిద్ధార్థ్, అదితి. ఇక వీరి ఎంగేజ్‌మెంట్ తర్వాత అదితి రావు హైదరీ నటించిన వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’ విడుదలయ్యింది. ఇందులో అదితిని చూసి మరోసారి ఫిదా అయిన సిద్ధార్థ్.. తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


బిబ్బోజాన్‌గా అదితి..


సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘హీరామండి’ వెబ్ సిరీస్.. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఇందుతో ఆరుగురు హీరోయిన్లు ముఖ్య పాత్రలు పోషించగా.. అందులో అదితి రావు హైదరీ కూడా ఒకరు. ‘హీరామండి’లో బిబ్బోజాన్ అనే పాత్రలో కనిపించింది అదితి. ఇందులో తన గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో కూడా అందరినీ కట్టిపడేసింది. ఇప్పటికీ ఈ వెబ్ సిరీస్‌ను చాలామంది ప్రేక్షకులు చూసి తమ పాజిటివ్ రివ్యూలను అందిస్తున్నారు. ఆ లిస్ట్‌లోకి సిద్ధార్థ్ కూడా యాడ్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘హీరామండి’పై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు సిద్ధు. ఈ సిరీస్‌లో అదితి ముజ్రా చేస్తున్న సీన్‌ను స్క్రీన్‌షాట్ తీసి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.


అదృష్టంగా భావిస్తున్నాను..


ముందుగా ‘హీరామండి’లోని యాక్టింగ్‌, మ్యూజిక్‌, కళ, డ్రామా గురించి మాటల్లో చెప్పలేక స్టార్‌ను యాడ్ చేశాడు సిద్ధార్థ్. ‘సంజయ్ లీలా భన్సాలీ సార్‌తో పాటు ఇదే తరంలో జీవిస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. హీరామండి అనేది గడిచిపోయిన కాలంలో ప్రేమ, పోరాటం గురించి అందంగా వివరించిన ఒక లేఖ లాంటిది. అందులోని సన్నివేశాలు మన మనసులను హత్తుకుంటాయి. మ్యూజిక్ గుండెను పిండేస్తుంది. టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది’ అంటూ ‘హీరామండి’కి తనవంతు ప్రమోషన్‌తో పాటు తన పాజిటివ్ రివ్యూను కూడా అందించాడు సిద్ధార్థ్.


నిజమైన కథ..


‘హీరామండి: ది డైమండ్ బజార్’లో అదితి రావు హైదరీతో పాటు సోనాక్షి సిన్హా, షర్మిన్ సెగల్, మనీషా కొయిరాల, సంజీదా షేక్, రిచా చడ్డా కూడా లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ ఆరుగురి పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఇస్తూ వెబ్ సిరీస్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశారంటూ సంజయ్ లీలా భన్సాలీని క్రిటిక్స్ సైతం ప్రశంసిస్తున్నారు. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను తన స్టైల్‌లో రిచ్‌గా తెరకెక్కించారు భన్సాలీ. స్వాతంత్ర్యం సమయంలో హీరామండి అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో జరిగిన కథే ‘హీరామండి’. సంజయ్ లీలా భన్సాలీ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించినప్పటి నుండి తన ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా అందరూ తృప్తిపడే విధంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారని ప్రశంసిస్తున్నారు.



Also Read: వనపర్తి గుడిలోనే ఎందుకు నిశ్చితార్థం? - అసలు విషయం చెప్పిన అదితి