The Boys Web Series Season 4 Streaming Date: సూపర్ హీరోలకు పెట్టింది పేరు హాలీవుడ్. ఇంగ్లీష్ సినిమాల నుంచే ఎంతో మంది సూపర్ హీరోలు పుట్టుకొచ్చారు. ‘సూపర్ మ్యాన్’, ‘స్పైడర్ మ్యాన్’ అంటూ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. నిజానికి సూపర్ మ్యాన్స్ అందరూ ప్రపంచానికి ఎదురయ్యే ఆపదలను తొలగిస్తారు. భూమికి ఎలాంటి ముప్పుకలగకుండా కాపాడుతారు. కానీ, అదే సూపర్ మ్యాన్స్ స్వార్థంగా ఆలోచిస్తే? ప్రపంచాన్ని తమ చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తే? అలాంటి కథాంశంతో తెరకెక్కిన వెబ్ సిరీసే ‘ది బాయ్స్’. ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేస్తున్న ఈ సిరీస్ త్వరలో నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రివీల్ చేసింది.  


‘ది బాయ్స్’ సీజన్ 4 ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే?


గత సీజన్ల మాదిరిగానే ‘ది బాయ్స్’ సీజన్ 4లో హోమ్‌ ల్యాండర్ పాత్రలో ఆంటోనీ స్టార్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నారు. కార్ల్ అర్బన్, ఎరిన్ మోరియార్టి, కరెన్ ఫుకుహారా ఈ సిరీస్ లో కనిపించనున్నారు. ఇందులోనూ ఆంటోనీ స్టార్ ఫుల్ డామినేషన్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ అభిమానులకు నచ్చేలా యాక్షన్, కామెడీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సైతం ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో పాటు చక్కటి కామెడీ సీన్లతో అలరించింది. ఈ వెబ్ సిరీస్ తాజా సీజన్ జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఒకేసారి విడుదల కానుంది.






‘ది బాయ్స్’ సీజన్ 4లో ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయంటే?


2019 జులై 26న ప్రైమ్‌ వీడియోలో ‘ది బాయ్స్’ వెబ్ సిరీస్ తొలి సీజన్ విడుదల అయ్యింది. ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రెండో సీజన్ 2020 సెప్టెంబర్ 4న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇది కూడా చక్కటి ఆదరణ దక్కించుకుంది. ‘ది బాయ్స్’ మూడో సీజన్ 2022లో స్ట్రీమింగ్ అయ్యింది. ‘ది బాయ్స్ 4’ జూన్ 2024 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ‘ది బాయ్స్’ సీజన్ 4 కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘ది బాయ్స్’ వెబ్ సిరీస్ కు సంబంధించి గత సీజన్లుకు దర్శకత్వం వహించిన ఫిల్ స్గ్రారిక్కియా, రాబోయే సీజన్ ను కూడా తెరకెక్కించారు. ‘ది బాయ్స్’ సీజన్ 4 గత సీజన్ మాదిరిగానే 5 ఎపిసోడ్లు ఉంటాయని తెలుస్తోంది.  


Read Also: పేద రైతులకు ఫ్రీగా ట్రాక్టర్లు, మాట నిలబెట్టుకున్న లారెన్స్, నిజంగా మీరు దేవుడు సామీ!