Aditi Rao Hydari React on Engagement With Siddharth: అదితి రావు హైదరి, హీరో సిద్దార్థ్‌ల సీక్రెట్‌ నిశ్చితార్థం ఇప్పటికి హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇద్దరు సెలబ్రిటీలే. ఏ స్టార్‌ హోటలో, లేదా గోవాలో జరుపుకోకుండా అలా రహస్యంగా వరంగల్‌ టెంపుల్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడపై అందరిలో సందేహాలు నెలకొన్నాయి. అదీ మీడియాకు ఎలాంటి అనుమతి లేదని స్ట్రిక్ట్‌గా రూల్‌ పెట్టారు. దీంతో వీరి నిశ్చితార్థం ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే విషయాన్ని ఓ ఈవెంట్‌లో సిద్ధార్థ్‌ని అడిగే తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. తన దృష్టిలో సీక్రెట్‌, ప్రైవేట్‌ అనే పదాలకు  చాలా వ్యాత్యాసం ఉందని, తమది పెద్దలు సమక్షంలో జరిగిన ప్రైవేట్‌ ఫంక్షన్‌ అన్నాడు.


ఇక తాజాగా ఆదితి రావు హైదరి కూడా దీనిపై ప్రశ్న ఎదురైంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో బాలీవుడ్‌ తారలతో తెరకెక్కిన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ 'హీరామండి: ది డైమండ్‌ బజార్‌'. ఈ మూవీ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఆదితి రావుకు సిద్ధార్థ్‌తో ఎంగేజ్‌మెంట్‌పై ప్రశ్న ఎదురైంది. ఎందుకు వరంగల్‌ గుడిలోనే నిశ్చితార్థం చేసుకున్నార? అని హోస్ట్‌ ప్రశ్నించారు. దీనికి అదితి స్పందిస్తూ.. "ఎవరైనా కూడా తమ జీవితంలో జరుపుకునే ముఖ్యమైన కార్యక్రమాలను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటారు. అలాగే నేను కూడా అనుకున్నాను. అందుకే మా నిశ్చితార్థాన్ని 400 ఏళ్ల చరిత్ర ఉన్న పవిత్రమైన దేవాలయంలో జరుపుకున్నాం. వరంగల్‌లోని వనపర్తి దేవాలయంకు మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే వనపర్తి దేవాలయంలో నిశ్చితార్థం జరుపుకున్నాం. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది" అని చెప్పుకొచ్చింది.


"నిజానికి మొదట మేము ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలను కోలేదు. కానీ, మా పెళ్లి విషయం తెలుసుకోవాలని చాలా మంది మా కుటుంబ సభ్యులు ఫోన్లు చేస్తున్నారు. వారందరికి సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మా అమ్మకు తరచూ ఫోన్లు వస్తుండేవి. దీంతో మా నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు చెప్పమని మా అమ్మ సలహా ఇచ్చారు. ఆమె కోరిక మేరకు మేమిద్దరం రింగులు మార్చుకున్నామని సోషల్‌ మీడియాలో వెల్లడించాం"  అంటూ అదితి వివరణ ఇచ్చింది. కాగా మార్చి 27న అదితి-సిద్ధార్థ్‌ల ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే గడిలో మీడియాకు కూడా అనుమతి లేకుండ ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో అంతా వారి పెళ్లి అనుకున్నారు. కానీ ఆ నెక్ట్స్‌ డే వీరిద్దరు జరిగింది పెళ్లి కాదు, నిశ్చితార్థం అని చెప్పి ట్విస్ట్‌ ఇచ్చారు. ఇద్దరు చేతికి రింగులు కనిపించేలా పోటోలు షేర్‌ చేసి "She Said Yes, He Said Yes" అంటూ అదితి, సిద్దార్థ్‌ ఇన్‌స్టా వేదికగా పోస్ట్స్‌ చేశారు. ఇది తెలిసి అంతా అవాక్క్‌ అయ్యారు. 







Also Read: 'కుబేర' నుంచి నాగార్జున‌ ‌లుక్‌ వచ్చేసింది - ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ చూశారా? 'కింగ్‌' లుక్‌ మామూలుగా లేదు