Sundar C And Kushbu Love Story: తమిళ హీరో, కుష్బు భర్త సుందర్.సి. ఆయన నటించిన 'అరణ్ మనై 4' సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్బంగా ఆయన ఆ సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు. వివిధ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో భాగంగా సుందర్ .సి ఎమోషనల్ అయ్యారు. కుష్బుకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కుష్బు తనని వదిలేసి వేరే పెళ్లి చేసుకోమని చెప్పిందని.. కానీ, దేవుడు వేరే ప్లాన్ చేసి తమ జీవితాల్లో ఆనందాన్ని ప్రసాదించాడని అన్నారు.
పిల్లలు పుట్టరు అన్నారు..
'అరణ్ మనై 4' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుందర్ సి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా కుష్బు అప్పుడే పుట్టిన తన కూతురిని ఎత్తుకున్న ఫొటో ఒకటి సుందర్‌కు చూపించారు. ఆ పిక్ చూడగానే సుందర్ ఎమోషనల్ అయ్యారు. “అది మాకు ఎమోషనల్ మూమెంట్. కుష్బు డెలివరీ అయిన వెంటనే ఆ ఫొటో తీశారు. అప్పుడే ఆమె స్పృహలోకి వచ్చింది. నేను ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడే చెప్తున్నాను. తన కళ్లలో ఆనందం మీరు చూడొచ్చు. ఎందుకంటే.. పెళ్లికి ముందు కుష్బుకు హెల్త్ ఇష్యూ వచ్చింది. డాక్టర్లు ఆమెకు పిల్లలు పుట్టరని చెప్పారు. దీంతో కుష్బు నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పింది. కానీ, నేను తననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మా జీవితంలో ఇక పిల్లలు ఉండరని అప్పటికే డిసైడ్ అయిపోయాను. కానీ, దేవుడికి మరో ప్లాన్ ఉంది. మాకు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు” అని చెప్పారు సుందర్.
కుష్బు హైపర్ యాక్టివ్.. నేను కాదు..
మరి అలాంటి ఎమోషనల్ ఫొటోను ఆమె పబ్లిక్‌కు షేర్ చేసేందుకు ఒప్పుకున్నారా? అంటే.. కుష్బుకు అన్ని మీడియానే అని అన్నారు సుందర్. ఆమె ప్రతీది ప్రేక్షకులతో షేర్ చేసుకోవాలని అనుకుంటారని, తాను మాత్రం పూర్తి ప్రైవేట్ పర్సన్ అని చెప్పుకొచ్చారు. కుష్బు చాలా హైపర్ యాక్టివ్ అని, తాను పూర్తి వ్యతిరేకం అని చెప్పారు. “ఇక ఇప్పుడు నా జీవితం ఓపెన్ బుక్’’ అని చెప్పుకొచ్చారు.
చాలాసార్లు బ్రేకప్ అయ్యింది..
“నేను కుష్బు ఐదేళ్లు ప్రేమలో ఉన్నాం. కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, చాలా సార్లు బ్రేకప్ చెప్పుకున్నాం. చాలాసార్లు న్యూస్ కూడా రాశారు మా గురించి. న్యూస్ రాసిన రోజే మళ్లీ కలిసి పార్టీకి వెళ్లేవాళ్లం. రిలేషన్ షిప్ లో ఇవన్నీ కామన్. మేం ఒకరి కోసం ఒకరు పుట్టాం అనుకున్నాం. అందుకే, పెళ్లి చేసుకున్నాం. 2000 సంవత్సరంలో ఇద్దరం ఒకటయ్యాం” అని తమ లవ్ స్టోరీ చెప్పారు సుందర్. తెలుగు, తమిళ్ తదితర భాషల్లో హీరోయిన్ గా చేసిన కుష్బు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. డీఎంకే పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.
Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న జ్యోతిక, అజయ్ దేవగన్ ‘సైతాన్’ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?