Shaitaan Movie OTT Release Date And Streaming Platform: అజయ్ దేవగణ్ తన కెరీర్‌లో నటించిన రెండో హారర్ సినిమా 'సైతాన్'. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ సాధించింది. సూపర్ హిట్ గా నిలిచింది. అజయ్ దేవగణ్.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన హారర్ సినిమా 'భూత్'. అది కూడా సూపర్ హిట్. ఇక ఇప్పుడు 'సైతాన్'ని ఓటీటీలో చూసేందుకు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?
రీలీజ్ ఎప్పుడంటే?
'సైతాన్' సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కాగా.. ఈ నెల 4న అంటే.. శనివారం రోజున ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా భారీగానే వసూళ్లు సాధించింది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా రీలీజైన 57 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే రూల్ ఉన్న నేపథ్యంలో మే 4న సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది నెట్ ఫ్లిక్స్.
కెరీర్ లో రెండో సినిమా..
అజయ్ దేవగణ్ నటించిన ఈ సినిమా హారర్ జోనర్ లో తెరకెక్కింది. కాగా.. అజయ దేవగణ్ తన కెరీర్ లో నటించిన రెండో హారర్ సినిమా ఇది. మొదటి సినిమా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో చేశారు. అది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ రెండో సినిమా కూడా దాదాపు రూ.150 కోట్లు వసూలు చేసింది. 'సైతాన్' రిలీజ్ టైంలో ఇంకా ఎన్నో సినిమాలు రిలీజైనప్పటికీ వాటిని అధిగమించింది 'సైతాన్'.
గుజరాత్ సినిమా రీమేక్..
‘సైతాన్’ గుజరాత్ సినిమా 'వాష్' మూవీకి రీమేక్. అయితే, మేకర్స్ మాత్రం 'సైతాన్' లో క్లైమాక్స్‌లో మార్పులు చేశారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజైన రోజు నుంచే అంచనాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఊహించినట్లే ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అజయ్ దేవగన్ మరో హిట్ కొట్టాడు. ఈ ఏడాదిలో ‘సైతాన్’.. అత్యధిక గ్రాస్ సాధించిన హిందీ సినిమాల్లో సెకెండ్ ప్లెస్ లో ఉంది. ఈ సినిమాకి వికాస్ బాహ్ల్‌కు డైరెక్టర్. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ కలిసి ‘సైతాన్’ను సంయుక్తంగా నిర్మించారు. కోలీవుడ్ నటి జ్యోతిక సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రి-ఎంట్రీ ఇస్తూనే హిట్ కొట్టేసింది. ఈ మూవీలో మాధవన్ పాత్రను చూస్తే వణుకు పుట్టడం ఖాయం. ఇక ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వాళ్లంతా మే 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూసెయొచ్చు. ‘సైతాన్’ రన్ టైమ్ కేవలం గంటన్నర మాత్రమే.
Also Read: పేద రైతులకు ఫ్రీగా ట్రాక్టర్లు, మాట నిలబెట్టుకున్న లారెన్స్, నిజంగా మీరు దేవుడు సామీ!