JIO Prepaid Plans: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకున్న యూజర్లకు కంపెనీ అదనపు డేటాను కూడా అందిస్తోంది. రూ. 999 ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు 40 జీబీ అదనపు డేటాను ఉచితంగా అందజేస్తున్నారు. చాలా మంది మొబైల్ ఫోన్‌లలో మ్యాచ్‌ని ఆస్వాదిస్తున్నందున జియో ఈ ప్లాన్‌లను IPLకి ముందే ప్రారంభించింది. ఐపీఎల్ 2023 సీజన్ జియో సినిమాలో మాత్రమే స్ట్రీమ్ కానుంది. కాబట్టి జియో ఈ కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. జియో సినిమా


మూడు కొత్త ప్లాన్లు ఇవే
IPL సీజన్ 16 మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31వ తేదీన జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఐపీఎల్‌కి ముందు జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త క్రికెట్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఇందులో ప్రతిరోజూ 3 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. కంపెనీ రూ. 999, రూ. 399, రూ. 219 యొక్క 3 ప్లాన్‌లను ప్రారంభించింది. రూ. 999 ప్లాన్‌లో కస్టమర్‌లు 84 రోజుల పాటు ప్రతిరోజూ 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో కంపెనీ రూ. 241 డేటా వోచర్‌ను కూడా ఉచితంగా ఇస్తోంది. దీని కింద కస్టమర్లు అదనంగా 40 జీబీ డేటాను ఉచితంగా పొందుతారు.


జియో రూ. 399, రూ. 219 ప్లాన్‌లలో కూడా కస్టమర్‌లు ప్రతిరోజూ 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. అయితే రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీ వేర్వేరుగా ఉంటుంది. రూ. 399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో మీరు కంపెనీ నుంచి ఉచితంగా రూ. 61 డేటా వోచర్‌ను పొందుతారు. దీని కింద మీకు 6 జీబీ డేటా అందించనున్నారు. అదే సమయంలో రూ. 219 ప్లాన్‌లో కంపెనీ 2 జీబీ అదనపు డేటాను ఇస్తుంది. దీని వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది.


డేటా యాడ్ ఆన్ ప్లాన్ కూడా
ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం జియో మూడు డేటా యాడ్ ఆన్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. Jio రూ. 222 ప్లాన్‌లో వినియోగదారులు 50 జీబీ డేటాను పొందుతారు. దీని వ్యాలిడిటీ ప్రస్తుతం మీరు ఉపయగిస్తున్న ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.


రూ.444 ప్లాన్‌లో వినియోగదారులు 60 రోజుల వ్యాలిడిటీతో 100 జీబీ డేటాను పొందుతారు. అదే విధంగా రూ.667 ప్లాన్‌లో కంపెనీ 90 రోజుల వ్యాలిడిటీతో 150 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది. కంపెనీ అందిస్తున్న మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు నేటి నుంచే అందుబాటులోకి వచ్చాయి. మీరు వాటిని జియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.


జియో సినిమా యాప్‌లో 4కే క్వాలిటీతో మ్యాచ్‌ను పూర్తిగా స్ట్రీమింగ్ చేయాలంటే ఏకంగా 25 జీబీ డేటా అవసరం. ఫుల్ హెచ్‌డీ క్వాలిటీతో స్ట్రీమింగ్ చేయాలంటే 12 జీబీ డేటా ఖర్చవుతుంది. మీడియం క్వాలిటీతో మ్యాచ్‌ను చూడటానికి 2.5 జీబీ, లో క్వాలిటీతో చూడటానికి 1.5 జీబీ డేటా అవసరం అవుతుంది.


కాబట్టి మీరు మొబైల్ డేటాతో మ్యాచ్ చూడాలనుకుంటే మీడియం, లో క్వాలిటీ ఆప్షన్లు ఎంచుకోవడం మంచిది. ఫుల్ హెచ్‌డీ, 4కే క్వాలిటీల్లో చూడాలంటే రోజుకు కనీసం రూ.200 వరకు ఖర్చవుతుంది. కాబట్టి మొబైల్ డేటాతో చూసేటప్పుడు స్ట్రీమింగ్ క్వాలిటీ దానికి తగ్గట్లు సెట్ చేసుకోండి.