Jio Airfiber: రిలయన్స్ జియో తన ఓపెన్ ఎయిర్ ఫైబర్ సేవను విస్తరించింది. పశ్చిమ యూపీలోని 41 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్ తన సేవలను ప్రారంభించింది. పశ్చిమ యూపీలోని నగరాల్లోని ప్రజలు దేశవ్యాప్తంగా జియో ఎయిర్ ఫైబర్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు వినియోగదారులు 16 ఓటీటీ యాప్స్, 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్స్‌ను చూసే అవకాశాన్ని పొందుతారు.
జియో ఎయిర్ ఫైబర్ సౌకర్యం ఏ నగరాల్లో అందుబాటులో ఉంది?
రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రారంభం అయింది. ఇటీవల ఇది పశ్చిమ యూపీలోని నగరాల్లో ప్రవేశపెట్టబడింది. బరేలీ, అలీఘర్, సహరాన్‌పూర్, మొరాదాబాద్, ఇటావా, ఫిరోజాబాద్, మధుర, ముజఫర్ నగర్ సహా 39 ఇతర నగరాల్లో కూడా జియో ఎయిర్ ఫైబర్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఆప్టికల్ ఫైబర్ ద్వారా 'లాస్ట్ మైల్ కనెక్టివిటీ'ని అందించడంలో ఇబ్బంది ఉన్న ప్రాంతాలకు జియో ఎయిర్ ఫైబర్ ఒక వరం. బ్రాడ్‌బ్యాండ్‌కు అనుసంధానం కాలేని లక్షలాది ప్రాంతాలకు జియో ఎయిర్ ఫైబర్ వరం కానుంది. ఫైబర్ తరహా వేగంతోనే డేటాను ప్రసారం చేస్తుంది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 41 నగరాల్లోని వినియోగదారులు ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా ప్రపంచ స్థాయి హోం ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ సేవలను ఆస్వాదించగలరు. జియో ఎయిర్ ఫైబర్‌ను జియో స్టోర్ నుంచి లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్
'జియో ఎయిర్ ఫైబర్' కోసం కంపెనీ రూ.599, రూ.899, రూ.1199కి మూడు ప్లాన్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.599 ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ అందుబాటులో ఉంటుంది. అయితే రూ.899, రూ.1199 ప్లాన్లలో, 100 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులో ఉంటుంది.
ఇది కాకుండా మీరు రూ.599, రూ.899 ప్లాన్‌లతో 14 ఓటీటీ యాప్స్‌కు సంబంధించిన ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ. 1199 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం వంటి 16 ఓటీటీ యాప్స్‌ను పొందుతారు. ఈ మూడు ప్లాన్‌ల్లోనూ కస్టమర్‌లు 550 కంటే ఎక్కువ ఉచిత డిజిటల్ టీవీ ఛానెల్‌లను పొందుతారు.
జియో ప్రైమా 4జీ ఫీచర్ ఫోన్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 2.4 అంగుళాల డిస్‌ప్లేను జియో అందించింది. కైఓఎస్ ప్లాట్‌ఫాంపై జియో ప్రైమా 4జీ ఫీచర్ ఫోన్ పని చేయనుంది. వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్, ఫేస్‌బుక్‌లను కూడా ఈ ఫోన్‌తో ఉపయోగించే అవకాశం ఉంది. 23 భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుండటం విశేషం. 1800 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. గతవారం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈ ఫోన్‌ని కంపెనీ మొదట రివీల్ చేసింది. ఈ ఫోన్ ధరను భారతదేశంలో రూ.2,599గా నిర్ణయించారు. అమెజాన్, జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో జియో ప్రైమా 4జీ ఫీచర్ ఫోన్ అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ తరహా ఫీచర్లున్న ఒక కీప్యాడ్ ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెటర్ ఆప్షన్.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!