రిలయన్స్ జియో తన వినయోగదారుల కోసం  వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ను అందుబాటులోకి తేబోతోంది.  జియో ఎయిర్‌ ఫైబర్‌ పేరుతో దీనిని లాంచ్ చేయనుంది. ఇవాళ్టి(సెప్టెంబర్ 19) నుంచి జియో కొత్త సేవలు ప్రారంభం కానున్నాయి. ఇండ్లు, ఆఫీసు అవసరాల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. 1.5 Gbps ఇంటర్నెట్ వేగంతో ఆయా పనులను మరింత వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఎలాంటి అంతరాయాలు లేకుండా HD వీడియోలు, ఆన్‌లైన్ గేమ్స్,  వీడియో కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది. 2023లో  వార్షిక సర్వసభ్య సమావేశంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఈ సేవలను వినాయక చవితి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. జియో ఎయిర్ పైబర్ లో పేరెంట్స్ కంట్రోల్స్, 6 Wi – Fi సపోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌ వాల్ సహా పలు అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి.

  


జియో ఎయిర్‌ ఫైబర్ ప్రత్యేక ఏంటి?   


జియో ఎయిర్‌ ఫైబర్ అనేది వైర్‌ లెస్ ఇంటర్నెట్ సౌకర్యం అందించే టెక్నాలజీ. దీనితో హై స్పీడ్ 5G ఇంటర్నెట్ సేవలను పొందే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులకు దాదాపు 1Gbps వరకు హై స్పీడ్ ఇంటర్నెట్ ను పొందే అవకాశం ఉంది. ఇండ్లతో పాటు కార్యాలయాల్లో ఈ 5G వేగంతో నెట్ సౌకర్యం పొందవచ్చు.  జియో పైబర్ తో పోల్చితే, జియో ఎయిర్ పైబర్ మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందింది.


టెక్నాలజీ


జియో పైబర్ కనెక్టివిటీ కోసం వైర్డు ఫైబర్ ఆప్టిక్‌ పై ఆధారపడాల్సి ఉంటుంది. జియో ఎయిర్ పైబర్ అనేది పాయింట్ టు పాయింట్ రేడియో లింక్స్ ద్వారా ద్వారా వైర్‌ లెస్ కనెక్షన్లను అందించడంలో ఉపయోగపడుతుంది. అంటే వైర్‌లెస్ సిగ్నల్ ద్వారా మీ పనులను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.  దీని ద్వారా ఫైబర్ కేబుల్స్, లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ లాంటి టెక్నాలజీ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.  


గణనీయమైన ఇంటర్నెట్ వేగం


జియో ఎయిర్ పైబర్ 1.5Gbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. జియో పైబర్ అత్యధికంగా 1 Gbps వరకు వేగాన్ని అందిస్తున్నది. అయితే, ఆయా ప్రాంతాల్లోని జియో టవర్ సిగ్నల్‌ను బట్టి వేగంలో మార్పులు ఉండే అవకాశం ఉంది.   


జియో ఎయిర్ పైబర్ తో పెరగనున్న కవరేజ్


జియో ఫైబర్ కవరేజీ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశంలోని అన్ని ప్రాంతాలకు పూర్తిగా చేరుకోలేదని చెప్పుకోవచ్చు.ఈ నేపథ్యంలో జియో ఎయిర్ పైబర్ వైర్‌లెస్ టెక్నాలజీ సహాయంతోమూరుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు అందించే అవకాశం ఉంటుంది.   


ఇన్‌ స్టాలేషన్ మరింత ఈజీ


జియో ఎయిర్ పైబర్ ఇన్‌ స్టాలేషన్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. జియో ఎయిర్ పైబర్ బాక్స్ ను ఇంటికి తీసుకొచ్చి  ప్లగ్ ఇన్ చేయాలి. ఎలాంటి అంతరాయం లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ పొందే అవకాశం ఉంటుంది. ఇక జియో ఫైబర్‌ను ఇన్‌ స్టాలేషన్ ప్రక్రియ అనే పలువురు నిపుణుల సాయంతోనే జరుగుతుంది.   


జియో ఎయిర్ పైబర్ ధర ఎంతంటే?


జియో ఎయిర్ పైబర్  ధర సుమారు రూ.6000 వరకు ఉంటుంది. సాధారణ బ్రాడ్‌ బ్యాండ్ కనెక్షన్ ధరతో పోల్చితే కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, మిగతా వాటితో పోల్చితే దీని వినియోగం చాలా సులభంగా ఉంటుంది.   


Read Also: ట్విటర్ యూజర్లకు షాక్ ఇవ్వనున్న మస్క్, అందరూ డబ్బు కట్టాల్సిందే ! 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial