Janasena Glass :   కేంద్ర ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయించింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అని పేర్కొంటూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జనసేన మళ్లీ పోటీకి సిద్ధమైంది. రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. జనసేన పార్టీ తరఫున పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జ‌న‌సేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంత కాలం కింద ర‌ద్దు చేసింది. ఇక పార్టీకి గుర్తు ఉండబోదంటూ ప్రచారం కూడా జరిగింది.  కానీ గ్లాస్ గుర్తు కేటాయిస్తూ..ఈసీ నిర్ణయం తీుకోవడంతో అన్నింటికీ చెక్ పెట్టినట్లయింది. 


 







గాజు గ్లాసంటే.. అందరికీ గుర్తొచ్చేది జనసేన పార్టీనే. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఈ గుర్తుతోనే బరిలో నిలిచింది. ఆ గుర్తుతోనే గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలోనే ఉన్నారు. పేదవాడి చాయ్ గ్లాస్ గా జనసేన తమ పార్టీ గుర్తుగా దాన్ని తీవ్రంగా ప్రచారం చేసింది. కానీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందలేకపోయింది. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలంటే.. మొత్తం పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు, కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు అయినా దక్కించుకోవాలి. అయితే గత ఎన్నికల్లో జనసేనకు.. 5.9 శాతం ఓట్లు వచ్చాయి.. ఒకే అసెంబ్లీ స్థానం గెలిచారు. అందుకే గుర్తింపు పొందలేకపోయారు.ఈ కారణంగా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ లో చేర్చారు.                                          


తెలుగు రాష్ట్రాలపై మహిళా రిజర్వేషన్ బిల్లు ఎఫెక్ట్, అన్ని సీట్లు కేటాయించాల్సిందేనా?


తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా జనసేన పోటీ చేయకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లోనూ జనసేన పొత్తులతో పోటీ చేయనుండటంతో గాజు గ్లాస్ గుర్తు కీలకం అయింది. జనసేన పోటీ లేని  చోట్ల గాజు గ్లాస్ ఉంటే సమస్య అవుతుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును ఈసీ రిజర్వ్ చేసినట్లుగా ప్రకటించడంోత.. ఓ సమస్య తీరిపోయినట్లయింది.                                   


బీజేపీతో ఎలాంటి డీల్ లేదు, ముస్లింల వల్లే రాహుల్ గెలుపు-అసదుద్దీన్ ఓవైసీ