Jio Airfiber: రిలయన్స్ జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవను అప్‌డేట్ చేసింది. కొన్ని రోజుల క్రితం ఎయిర్‌ఫైబర్ సేవలను ప్రారంభించింది. ఈ సర్వీసు సహాయంతో యూజర్ ఇంటిలో వైర్‌లెస్ రూటర్ ఇన్‌స్టాల్ చేయవచ్చు. దీని ద్వారా ఇంటర్నెట్ డేటా సర్వీసు వైర్‌లెస్‌గా అందుబాటులో ఉంటుంది. అంటే ఇది వైర్‌లెస్ హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా సర్వీస్ అన్నమాట. ప్రారంభంలో జియో కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే తన ఎయిర్‌ఫైబర్ సర్వీసును ప్రారంభించింది. కానీ ఇప్పుడు దీన్ని ఏకంగా భారతదేశంలోని 5352 నగరాలకు విస్తరించింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.


ఐదు వేలకు పైగా నగరాల్లో... (Jio Airfiber Cities) 
జియో గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఎయిర్‌ఫైబర్ సేవను ప్రారంభించింది. జనవరి నాటికి జియో ఈ సేవలను 3939 చిన్న, పెద్ద నగరాలకు విస్తరించింది. కానీ ఇప్పుడు 2024 మార్చి నాటికి Jio దీని సేవలను ఏకంగా 5352 నగరాలకు విస్తరించింది. జియో 5జీ ఎస్ఏ (స్టాండ్ అలోన్) నెట్‌వర్క్‌లను ప్రవేశపెట్టిన ప్రాంతాలకు జియో ఈ సేవను విస్తరిస్తుంది.


జియో తన 5జీ స్టాండ్ అలోన్ నెట్‌వర్క్‌ను కూడా వేగంగా విస్తరిస్తోంది. అంటే కంపెనీ ఎక్కడైతే 5జీ సర్వీస్‌ను అందిస్తుందో అక్కడ ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ను కూడా ప్రారంభిస్తుందన్న మాట. అయితే కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.


ప్లాన్లు ఇలా... (Jio Airfiber Plans)
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు రూ. 599 నుంచి ప్రారంభం కానున్నాయి. మీరు ఈ ప్లాన్‌ని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ లేదా దీర్ఘకాలిక చెల్లుబాటుతో కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో చవకైన ప్లాన్ రూ. 599. దీంతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాలి. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 30 ఎంబీపీఎస్ వేగంతో 1 టీబీ మంత్లీ డేటాను పొందుతారు. రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్, ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ రూపంలో రెండు రకాల ప్లాన్‌లను అందించింది. ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్‌ల ధర ఎక్కువ. కానీ వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది.


జియో ఎయిర్‌ఫైబర్ కొత్త కనెక్షన్ పొందడానికి వినియోగదారులు జియో అధికారిక వెబ్‌సైట్ లేదా మై జియో యాప్‌కి వెళ్లాలి. ఇది కాకుండా వినియోగదారులు 6000860008కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వాట్సాప్ నుంచి జియో ఎయిర్‌ఫైబర్ సేవను బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ గురించి సమాచారాన్ని పొందడానికి వినియోగదారులు తమ సమీప జియో స్టోర్‌ను కూడా సందర్శించవచ్చు.


మరోవైపు జియో ఇటీవలే తన ఎయిర్‌ఫైబర్ ప్లస్ వినియోగదారుల కోసం ధన్ ధనా ధన్ ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఐపీఎల్ సందర్భంగా జియో అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ ఇది. దీని ద్వారా వినియోగదారులకు ట్రిపుల్ స్పీడ్ ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. ధన్ ధనా ధన్ ఆఫర్ కింద ఎయిర్‌ఫైబర్ ప్లస్‌ని ఉపయోగిస్తున్న వినియోగదారులకు జియో ఏకంగా మూడు రెట్లు ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ 60 రోజుల పాటు అందుబాటులో ఉండనుంది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?