ఐటెల్ ఏ49 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్. కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఇందులో అందించారు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది.


ఐటెల్ ఏ49 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.6,499గా నిర్ణయించారు. క్రిస్టల్ పర్పుల్, డోమ్ బ్లూ, స్కై సియాన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వెబ్‌సైట్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.


ఐటెల్ ఏ49 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించారు. క్వాడ్‌కోర్ 1.4 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్ ఇందులో అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. రెండు 5 మెగాపిక్సెల్ సెన్సార్లను ఇందులో అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు కూడా 5 మెగాపిక్సెల్ కెమెరానే అందించారు. ఏఐ బ్యూటీ మోడ్ కూడా ఇందులో ఉంది.


2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ పోర్టు ఇందులో ఉన్నాయి.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?