Fourth Covid Wave: మామా మనం సేఫ్! ఎన్ని కొవిడ్ వేవ్‌లు వచ్చినా పర్లేదట!

ABP Desam   |  Murali Krishna   |  20 Mar 2022 05:41 PM (IST)

భవిష్యత్తులో మరిన్ని కొవిడ్ వేవ్‌లు వచ్చినా అంత ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

మామా మనం సేఫ్! ఎన్ని కొవిడ్ వేవ్‌లు వచ్చినా పర్లేదట!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో కూడా కరోనా ఫోర్త్ వేవ్ రానుందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. అయితే ఎన్ని వేవ్‌లు వచ్చినా భారత్‌పై వాటి ప్రభావం తక్కువగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు. దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో మాస్కు ధరించడం తప్పనిసరి నిబంధనను తొలగించే మార్గాలపై కేంద్రం దృష్టిసారించాలన్నారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అందువల్ల భవిష్యత్తులో వచ్చే వేవ్​లు మనపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. గతేడాది సెకండ్ వేవ్ చూపినంత ప్రభావం భవిష్యత్తులో ఉండదు.                                        - సంజయ్ రాయ్, దిల్లీ ఎయిమ్స్ వైద్యుడు​

మాస్క్ తప్పనిసరా?

మాస్కు ధరించడం తప్పనిసరి అనే నిబంధనను కూడా ప్రభుత్వం పునః పరిశీలించాలని సంజయ్ రాయ్ సూచించారు. వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో ఉన్నవాళ్లు మాత్రం ముందజాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్కు ధరించడం కొనసాగిస్తేనే సరిపోతుందన్నారు. భవిష్యత్తులో ఒకవేళ కొత్త వేరియంట్ వచ్చినా మునుపటి వేరియంట్లలా ప్రభావం చూపకపోవచ్చని సంజయ్ అన్నారు.

కేంద్రం హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్.. ఫైవ్ ఫోల్డ్ స్ట్రాటజీ పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు తెలిపారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-నిబంధనలను తప్పక పాటించాలన్నారు.

కరోనా జాగ్రత్తలు పాటించేలా చూడాలి. వీలైనన్నీ కరోనా శాంపిళ్లను ఇన్సాకాగ్‌కు పంపాలి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) జారీ చేసిన ప్రొటోకాల్ ప్రకారం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి శాంపిళ్లను ఎక్కువగా పంపాలి. దీని వల్ల కొత్త వేరియంట్లను గుర్తించవచ్చు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం టెస్టింగ్ విధానాలను పాటించాలి.                                                                   "
-రాజేశ్ భూషణ్, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టాలని, అర్హులైన ప్రతి ఏజ్ గ్రూప్ వారికీ అవగాహన కల్పిస్తూ కరోనా టీకా అందించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల  హెల్త్, చీఫ్ సెక్రటరీలకు లేఖలు పంపింది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ఈ లేఖలు రాసింది. మాస్క్ ధరించడం, శానిటైజర్ వినయోగంలోనూ నిర్లక్ష్య ధోరణి రాకుండా చూడాలని చెప్పింది. 

Also Read: Arvind Kejriwal: '4 రాష్ట్రాల్లో గెలిచారు ఏం లాభం? పంజాబ్‌లో మా పనితనం చూడండి'

Also Read: UP Auto Accident: బెలూన్ తగిలి ఆటో బోల్తా- ఇదేం హోలీరా నాయనా!

Published at: 20 Mar 2022 05:38 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.