iQoo Z7 5G: ఐకూ జెడ్7 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా మనదేశంలోనే విక్రయించనున్నారు. దీనికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి.


ఐకూ జెడ్7 5జీ ధర
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999గా నిర్ణయించారు.


అయితే ప్రారంభ ఆఫర్ కింద 6 జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.17,499కు, 8 జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.18,499కి కొనుగోలు చేయవచ్చు. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే మొదలైంది.


ఐకూ జెడ్7 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.38 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. కెపాసిటివ్ మల్టీ టచ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇక సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే... ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఇందులో ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, దీంతోపాటు 44W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ కూడా అందించారు. వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టును అందించారు. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 173 గ్రాములుగా ఉంది.


ఐకూ 11 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఇటీవలే లాంచ్ అయిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. ఇటీవలే లాంచ్ అయిన వివో ఎక్స్90 సిరీస్‌కు, త్వరలో లాంచ్ కానున్న షావోమీ 13 సిరీస్‌కు ఇవి పోటీ ఇవ్వనున్నాయి. ఐకూ 11 ప్రోలో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 4,999 యువాన్లుగానూ (సుమారు రూ.59,200), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,499 యువాన్లుగానూ (సుమారు రూ.65,000) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 యువాన్లుగా (సుమారు రూ.70,000) నిర్ణయించారు.