చైనీస్ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ భారత్ మార్కెట్ పై మరింత ఫోకస్ పెట్టింది. తన లేటెస్ట్ Z6 సిరీస్ నుంచి మరిన్ని ఫోన్లను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ నెలలో  మరో  Z6 స్మార్ట్‌ ఫోన్ మోడల్‌ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నది.  ఐక్యూ Z6 లైట్ 5G పేరుతో ఈ లేటెస్ట్ ఫోన్ రిలీజ్ కానుంది.  అయితే ఈ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లను కంపెనీ ఇప్పటి వరకు వెల్లడించలేదు.  కానీ Z6 లైట్ మోడల్ Vivo T1X ఫోన్‌కు రీబ్రాండెడ్ మోడల్ గా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే వాస్తవం అయితే, ఐక్యూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఇలా ఉండే అవకాశం ఉంది.       


iQOO Z6 Lite 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..


iQOO Z6 Lite 5G 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తున్నది. బడ్జెట్ కేటగిరీ ఫోన్‌ గా ఉండే అవకాశం ఉన్నందున.. iQOO Z6 Lite సెగ్మెంట్‌ లో 120Hz వేగవంతమైన రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌ ను కలిగి ఉన్న మొదటి ఫోన్ గా చెప్పుకోవచ్చు. 1080 x 2408 పిక్సెల్స్ ఫుల్  HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌ తో IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.  4 GB / 6 GB RAM తో పాటు  64 GB / 128 GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉండనుంది.  ఆప్టిక్స్ పరంగా f/1.8 ఎపర్చరు, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉండనుంది. 


ఇతర ఫీచర్లను చూస్తే సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 12 ఆధారంగా FunTouchOS 12, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి.


Vivo T1X స్పెసిఫికేషన్లు


వివో T1x ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌ తో కూడిన 6.58-ఇంచుల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 90.6 శాతం బాడీ టు స్క్రీన్ రేషియో, 96 శాతం NTSC కలర్ గామట్‌ తో వస్తుంది. ఈ ఫోన్ 6GB   RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌ డ్రాగన్ 680 SoC చిప్‌ సెట్‌ తో పని చేస్తుంది. 


వివో టీ1ఎక్స్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఫన్‌టచ్ OS 12తో  నడుస్తుంది.  వివో T1x ఫోన్‌లో డ్యుయల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంటుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా ఫిక్సెల్  సెల్ఫీ కెమెరా ఉంటుంది.