iQoo Neo 9S Pro Plus Launched: ఐకూ నియో 9ఎస్ ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఐకూ నియో 9 సిరీస్‌లో వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఇందులో ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, ఏకంగా ఐదు వేరియంట్లలో ఇది మార్కెట్లోకి వచ్చింది.


ఐకూ నియో 9ఎస్ ప్రో ప్లస్ ధర
ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,999 యువాన్లుగా (సుమారు రూ.34,000) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,399 యువాన్లుగానూ (సుమారు రూ.39,000), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,699 యువాన్లుగానూ (సుమారు రూ.42,000) ఉంది. 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొనాలంటే 3,299 యువాన్లుగా (సుమారు రూ.36,000) ఖర్చు పెట్టక తప్పదు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ వేరియంట్ ధరను 4,099 యువాన్లుగా (సుమారు రూ.46,000) నిర్ణయించారు. బఫ్ బ్లూ, స్టార్ వైట్, ఫైటింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: 2 జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్‌ చిల్లు


ఐకూ నియో 9ఎస్ ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 93.43 శాతంగానూ ఉంది. ఆక్టాకోర్ 4 ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ అందించారు. ఏకంగా 1 టీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


5జీ, వైఫై 7, బ్లూటూత్ వీ5.4, యూఎస్‌బీ ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, బైదు, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. అల్ట్రా సోనిక్ 3డీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది.



Also Read: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లకు గుడ్ న్యూస్ - ‘మెటా AI’ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసా?