First Sleeper Vande Bharat Train in Telangana: తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ మీదుగా మరో వందే భారత్ రైలును ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. భారత్ లో ప్రవేశపెట్టనున్న తొలి స్లీపర్ రైలును తెలంగాణలోనే పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఈ రైలును ప్రారంభించాలని రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాన నగరాల మధ్య విడతల వారీగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి వందే భారత స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.


తొలి వందే భారత్ స్లీపర్ రైలు సికింద్రాబాద్ నుంచి ముంబై వరకు నడిపే అవకాశాలున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి ముంబైకి వందే భారత్ రైలు సర్వీసు లేదు. అందుకే ఈ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుంచి ముంబైకి నడిపే ఆలోచనను కేంద్ర రైల్వే శాఖ చేసినట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ - ముంబై మధ్య వందే భారత్ రైలు లేకపోవడంతో పోలీసులు స్లీపర్ రైలును ఈ రూట్లో నడపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకు సూచించారు. ఈ ప్రతిపాదనను దక్షిణ మధ్య రైల్వే బోర్డుకు పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సికింద్రాబాద్ - పూణే మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందే భారత్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. అయితే, ఈ స్లీపర్ రైలు ఏ మార్గంలో నడపాలనే అంశంపై రైల్వే శాఖ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాలేదు.


వందే భారత్ తొలి స్లీపర్ రైల్ ఆగస్టులో పట్టాలపైకి 


వందే భారత్ తొలి స్లీపర్ రైలును ఆగస్టులో పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఆ తరువాత దేశంలోని ప్రధాన నగరాల మధ్య విడతల వారీగా వీటిని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందే భారత స్లీపర్ రైలు సికింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపనున్నారు. ఆగస్టులో తొలి రైలు ప్రారంభమైన తర్వాత కొద్ది నెలల్లోనే దేశంలోని ఇతర ప్రముఖ ప్రాంతాలకు కూడా స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా దేశంలోని ప్రముఖ నగరాలకు వందే భారత్ స్లీపర్ రైల్ సేవలను తీసుకువచ్చేలా రైళ్ల తయారీ ప్రక్రియను కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే పూర్తి చేస్తోంది. ఏడాదిలోగా దేశంలోని ప్రముఖ నగరాల్లో కనీసం 20 వందే భారత స్లీపర్ రైళ్లను తిప్పాలనే యోచనలో కేంద్ర రైల్వే శాఖ ఉంది. 


ఆ రైళ్లకు సంబంధించి కేంద్రమంత్రి కీలక ప్రతిపాదన 


మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో రెండు రైళ్లకి సంబంధించిన మార్పులు, చేర్పులపై రైల్వే అధికారులతో చర్చించి కీలక ప్రతిపాదనలు పంపించేందుకు సిద్ధమయ్యారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి - నిజామాబాద్ ల మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తోంది. అయితే, నిజాంబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ ఖాళీ లేకపోవడంతో బోధన్ వరకు ఈ రైలును తీసుకు వెళుతున్నారు. ఈ రైలు బయలుదేరే ముందు బోధన్ నుంచి నిజామాబాద్ కు తీసుకువస్తున్నారు. అలాగే, సికింద్రాబాద్ రాజ్కోట్ మధ్య రాజ్కోట్ ఎక్స్ప్రెస్ నడుస్తోంది. అయితే, హైదరాబాదులో గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఈ రాజకోట ఎక్స్ప్రెస్ ను కచ్ వరకు నడపాలనే డిమాండ్ వినిపిస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ రెండు అంశాలపై సమీక్ష చేశారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ ను బోధన్ వరకు, అలాగే రాజ్కొట్ ఎక్స్ప్రెస్ ను కచ్ వర్క్ పొడిగించే అంశంపై చర్చించారు. ఈ రెండు ప్రతిపాదనలను రైల్వే బోర్డుకి పంపిస్తామని రైలు అధికారులు తెలిపారు. అలాగే, కాచిగూడ - బెంగళూరు మధ్య నడుస్తున్న వందే భారత్ కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎనిమిది కోతులతో నడుస్తున్న ఈ రైలులో 16 కోచ్ లకు పెంచాలనే ప్రతిపాదనలు కూడా తెరపైకి వచ్చాయి. చర్లపల్లి టెర్మినల్ పనులను వేగంగా పూర్తిచేసే ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంపై ఫోకస్ పెట్టారు. ప్రధాని నరేంద్ర దీనిని ప్రారంభించనున్నారు.