12th July 2024 News Headlines in Telugu For School Assembly:
1. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రశ్నేలేదని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ చేస్తామని ఎవరు చెప్పారని ఆయన ఎదురుప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామనే భయాలు పెట్టుకోవాల్సిన పని లేదని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.
2. భోగాపురం విమానాశ్రయాన్ని 2026 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విమానాశ్రయాన్ని పూర్తి చేసే బాధ్యత విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకోవాలని... ఎప్పటికప్పడు సమీక్ష నిర్వహించాలని సూచించారు.
3. తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. మరో ఆరుగురు గులాబీ పార్టీ శాసనసభ్యులు హస్తం తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.
4. హైదరాబాద్ మెట్రోను మరింత విస్తరించనున్నారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకూ ఏడు కిలోమీటర్ల మెట్రోను విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధమైంది. మొత్తం ఏడు కిలోమీటర్ల దూరానికి ఆరు స్టేషన్లతో మెట్రోకు అధికారులు తుది మార్గాన్ని సిద్ధం చేశారు.
జాతీయ వార్తల్లోని ముఖ్యాంశాలు
5. సంయుక్త కిసాన్ మోర్చా మరోసారి దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమైంది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమాన్ని చేపట్టిన సంయుక్త కిసాన్ మోర్చా మరోసారి పోరు చేసేందుకు రెడీగా ఉన్నట్టు ప్రకటించింది. పంట రుణాలు మాఫీ, అన్నదాతలకు పెన్షన్, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత వంటి ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వెల్లడించింది.
6. నీట్ యూజీ పరీక్షలో ఎలాంటి అవతకవకలు జరగలేదని.. మరోసారి పరీక్ష నిర్వహించే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల మూడో వారంలో కౌన్సెలింగ్‌కు సన్నాహాలు చేస్తున్నామని ఈ దశలో పరీక్ష నిర్వహించలేమని తెలిపింది. నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్‌టీఏ కూడా ప్రమాణ పత్రం దాఖలు చేసింది.
అంతర్జాతీయ వార్తల్లోని హెడ్‌లైన్
7. అమెరికా అధ్యక్ష ఎన్నికలు గందరగోళంగా మారాయి. డెమొక్రాట్-రిపబ్లిక్ పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరూ తమకు వద్దని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్‌తో పోలీస్తే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌పైనే వ్యతిరేకత ఎక్కువగా ఉంది.
క్రీడా వార్త
8. యూరో ఫుట్‌బాల్‌లో మరోసారి ఇంగ్లాండ్ అదరగొట్టింది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. 90వ నిమిషంలో ఒలీ వాట్కిన్స్ గోల్ చేసి ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఈ విజయం తరువాత ఇంగ్లండ్.. ఈనెల 15న స్పెయిన్‌తో టైటిల్ పోరులో తలపడనుంది.
రిసెర్చ్
రిసెర్చ్
9. ప్రపంచంలో ఎక్కువ ఆత్మ హత్యలు నమోదవుతున్నది భారత్‌లోనే అని గణాంకాలు చెప్తున్నాయి. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో భారత్‌లో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఆత్మహత్యల నివారణకు తీసుకునే చర్యలపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మంచిమాట
కలలు కనండి.. ఆ కలలు సాకారం చేసుకోండి.. అబ్దుల్ కలాం