iQoo Neo 9 Series: ఐకూ నియో 9 సిరీస్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో రెండు ఫోన్లు ఉన్నాయి. అవే ఐకూ నియో 9, ఐకూ నియో 9 ప్రో. ఈ సిరీస్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. రెండు ఫోన్లలోనూ 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించారు. ప్రస్తుతానికి ఇవి చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


ఐకూ నియో 9 ధర (iQoo Neo 9 Price)
ఇందులో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.26,900) ఉంది. 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,499 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.29,300), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.32,800) నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,199 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.37,400) ఉంది.


ఐకూ నియో 9 ప్రో ధర (iQoo Neo 9 Pro Price)
ఇందులో కూడా నాలుగు వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.35,100) నిర్ణయించారు. 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,299 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.38,600), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,599 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.42,100) ఉంది. అన్నిటికంటే టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.46,800) ఉంది.


ఫైటింగ్ బ్లాక్, నాటికల్ బ్లూ, రెడ్, వైట్ సోల్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. త్వరలో మనదేశంలో కూడా ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


ఐకూ నియో 9, ఐకూ నియో 9 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ రెండు ఫోన్లలోనూ 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2,800 x 1,260 పిక్సెల్స్‌గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. హెచ్‌డీఆర్10+ను ఈ ఫోన్లు సపోర్ట్ చేయనున్నాయి. ఐకూ నియో 9 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఐకూ నియో 9 ప్రోలో మీడియాటెడ్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్‌పై ఈ ఫోన్లు రన్ కానున్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... రెండు ఫోన్లలోనూ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఐకూ నియో 9లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. ఐకూ నియో 9 ప్రోలో కూడా రెండు కెమెరాలే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను ఇందులో అందించారు. 


ఈ రెండు ఫోన్లలోనూ 5160 ఎంఏహెచ్ బ్యాటరీలు అందించారు. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్లు సపోర్ట్ చేయనున్నాయి. 5జీ, 4జీ వోల్టే, వైఫై 7, బ్లూటూత్ వీ5.3, ఓటీజీ, జీపీఎస్, బైదు, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఇందులో ఉన్నాయి. ఐఆర్ బ్లాస్టర్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో చూడవచ్చు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!