iQoo Neo 9 Pro Launched: ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ప్రీమియం మిడ్ రేంజ్‌లో ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్920 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు.
ఐకూ నియో 9 ప్రో ధర (iQoo Neo 9 Pro Price in India)
ఇందులో రెండు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరే్జ్ వేరియంట్ ధర రూ.37,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. కాంకరర్ బ్లాక్, ఫీరీ రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఐకూ ఇండియా ఈ-స్టోర్లలో ఇది అందుబాటులో ఉండనుంది. శుక్రవారం నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది.
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభించనుంది. అయితే ఈ ఆఫర్ ఫిబ్రవరి 26వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత రూ.1,000 తగ్గింపు మాత్రమే అందించనున్నారు.
ఐకూ నియో 9 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (iQoo Neo 9 Pro Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. మూడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నారు. ఇందులో 6.78 అంగుళాల 1.5కే ఎల్టీపీవో అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. గేమింగ్ సమయంలో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా సపోర్ట్ చేయనున్నారు. వెట్ టచ్ టెక్నాలజీ కూడా ఈ ఫోన్‌లో ఉంది. తడి చేతులతో కూడా ఫోన్ ఉపయోగించవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
256 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఇందులో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ కూడా అందించారు.
బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ కాగా, 120W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?