iQoo 9 Pro Sale: ఐకూ 9 ప్రో, ఐకూ 9 స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.. వీటిలో ఐకూ 9 ప్రో అత్యంత ప్రీమియం మోడల్. ఇందులో ఐకూ హైఎండ్ స్సెసిఫికేషన్లు అందించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఐకూ 9 ప్రో పనిచేయనుంది. ఐకూ 9లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్ అందించారు.


ఐకూ 9 ప్రో ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,990 కాగా... 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.69,990గా నిర్ణయించారు. డార్క్ క్రూజ్, లెజెండ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే... రూ.6,000 ఫ్లాట్ డిస్కౌంట్, రూ.5,000 అదనపు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ లభించనుంది. అంటే మొత్తంగా రూ.11 వేలు తగ్గింపు లభించనుంది.


ఐకూ 9 ధర
ఇందులో కూడా రెండు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.42,990 కాగా... 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,990గా ఉంది.ఆల్ఫా, లెజెండ్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా ఐకూ 9 కొనుగోలు చేస్తే... రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్, రూ.3,000 అదనపు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ లభించనుంది. ఈ ఫోన్‌పై రూ.ఏడు వేలు తగ్గింపు అందించారన్న మాట.


ఐకూ 9 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఐకూ 9 ప్రో పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల 2కే ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 3డీ కర్వ్‌డ్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. ఇందులో ఎల్టీపీవో 2.0 టెక్నాలజీని అందించారు. అడాప్టివ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 120W ఫ్లాష్ చార్జ్, 50W వైర్‌లెస్ ఫ్లాష్‌చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జీఎన్5 సెన్సార్‌ను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కోసం ‘గింబల్’ టెక్నాలజీని అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ ఫిష్ ఐ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 16 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


ఐకూ 9 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఇందులో 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 10-బిట్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4350 ఎంఏహెచ్‌గా ఉంది. 120W ఫ్లాష్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్‌ను అందించారు. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను ఉంది.


Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!