ఒకప్పటి హీరోయిన్ ఈషా కొప్పికర్ బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్, నెపోటిజం కారణంగా అవకాశాలు కోల్పోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ముందుగా మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత నటిగా అవకాశాలు దక్కించుకుంది. హిందీలో ఆమె 'ఏక్ థా దిల్ ఏక్ థి ధడ్కన్', 'ఫిజా', 'ప్యార్ ఇష్క్ ఔర్ మొహమ్మద్', 'కంపెనీ', 'కాంటే' వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో నాగార్జున సరసన 'చంద్రలేఖ' అనే సినిమాలో కనిపించింది.

 

ఈ బ్యూటీ 2009లో టిమ్మీ నారంగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కూతురు పుట్టిన తరువాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. తెలుగులో 'కేశవ' అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె కెరీర్ ఆరంభంలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పింది. 

 

అప్పట్లో ఓ నిర్మాత నుంచి ఫోన్ వచ్చిందని.. మా హీరోకి మీరు బాగా నచ్చారు ఒకసారి ఆయనతో మాట్లాడండి అని చెబితే ఆయన ఉద్దేశం అర్ధం కాలేదని చెప్పింది ఈషా. ఆ తరువాత నేరుగా హీరోగా కాల్ చేసి మాట్లాడితే.. ఆయన కాసేపటికే ఒంటరిగా తనను కలవమని.. స్టాఫ్ ను వెంటబెట్టుకొని రావొద్దని చెప్పాడట. దీంతో ఆమెకి విషయం అర్ధమై వెంటనే ఫోన్ పెట్టేసిందట. హీరో మాటలకు బాధ కలిగి నిర్మాతకు ఫోన్ చేసి.. 'నా టాలెంట్, అందం కారణంగా అవకాశాలు వస్తే చాలు..' అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంది. ఫైనల్ గా హీరోని ఒంటరిగా కలవలేదని ప్రాజెక్ట్ నుంచి తప్పించారని క్లారిటీ ఇచ్చింది.