ఐఫోన్ ప్రియులకు శుభవార్త. వచ్చే నెలలో నిర్వహించనున్న ఈవెంట్ లో Apple కొత్త iPhone 17 సిరీస్ ను విడుదల చేయనుంది. అయితే విడుదలకి ముందే, iPhone 17 మోడల్ ఉత్పత్తి భారతదేశంలోనే ప్రారంభమైంది. నివేదికల ప్రకారం, కర్ణాటకలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్ లో ఐఫోన్ ఫోన్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో పాటు, కంపెనీ చెన్నైలోని యూనిట్ లో ఈ మోడల్ తయారుచేయనుంది.  

భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తికి సంబంధించి ప్లాన్ ఇది 

యాపిల్ కంపెనీ క్రమంగా భారతదేశంలో తన ఉత్పత్తిని పెంచుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ భారతదేశంలో దాదాపు 4 కోట్ల iPhone యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది 6 కోట్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫాక్స్‌కాన్ భారతదేశంలో iPhoneలను ఉత్పత్తి చేస్తుందని తెలిసిందే. కంపెనీ 2023లో అనుమతి పొందడంతో పాటు యూనిట్ ఏర్పాటు కోసం రూ. 24,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. భారతదేశంతో పాటు iPhone 17 కూడా చైనాలోనూ ఉత్పత్తి జరుగుతోంది.

వచ్చే నెలలో iPhone 17 సిరీస్ విడుదల

iPhone 17 సిరీస్ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో iPhone 17, iPhone 17 Airతో పాటు iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ రానున్నాయి. లీక్ ల ప్రకారం చూస్తే, కంపెనీ ఈ సిరీస్ లో బేస్ స్టోరేజ్ ను 256GB చేయవచ్చు. దాంతో పాటు లేటెస్ట్ మోడల్ ఫోన్ల బరువును తగ్గించడానికి, వాటిని టైటానియంకు బదులుగా అల్యూమినియం బాడీలో తేవాలనుకుంటోంది. ఈ సిరీస్ వెనుక డిజైన్ అప్డేట్ చేస్తోంది. కొత్త ఫుల్-విడ్త్ కెమెరా ఐలాండ్ డిజైన్ ఇస్తారు.

ఐఫోన్ 17 సిరీస్ ధర ఎంత ఉండొచ్చు..

బేస్ స్టోరేజ్ ను పెంచుతున్నారు కనుక iPhone ధరపై ప్రభావం చూపుతుంది. iPhone 17 సిరీస్ ధర రూ. 83,300 నుండి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఐఫోన్ 17 ప్రో వేరియంట్ల ధరలు కూడా iPhone 16 సిరీస్ కంటే చాలా పెరగవచ్చు. అయితే, ఫోన్ల ధరలపై యాపిల్ కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.