Apple iPhone 16: యాపిల్ తన మెగా ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ నాలుగు ఫోన్‌లను లాంచ్ చేసింది. అదే సమయంలో ఈ ఫోన్ ప్రీ బుకింగ్ సెప్టెంబర్ 13వ తేదీ నుంచి భారతదేశంలో కూడా ప్రారంభం అయింది. యాపిల్ ప్రజలను ఆకర్షించడానికి గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో ఐఫోన్ 16 కొనాలనుకునే వారికి రూ. 32,200 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఎంత?
ఈ-కామర్స్ సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఐఫోన్ 16 బేస్ మోడల్‌ను కొనుగోలు చేయడంపై రూ. 32,200 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ మీ పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి అది బ్రాండెడ్ ఫోన్ అయితే మీరు రూ.32,200 వరకు తగ్గింపు పొందవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
అంటే మీరు ఐఫోన్ 16 బేస్ మోడల్‌ను రూ.79,900కి బదులుగా కేవలం రూ.47,998కే కొనుగోలు చేయవచ్చన్న మాట. ఇందులో సేఫ్ ప్యాకేజింగ్ ఛార్జీ రూ.99, పికప్ ఛార్జీ రూ.199 కూడా ఉన్నాయి.
ఐఫోన్ 16 ఫీచర్లు ఇవే...
ఈ తాజా ఐఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే కంపెనీ ఐఫోన్ 16లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ ఏ18 ప్రాసెసర్‌పై రన్ కానుంది. ఈ చిప్‌సెట్ ఏ16 బయోనిక్ కంటే 30 శాతం వేగవంతమైనదని యాపిల్ తెలిపింది.
కెమెరా ఫీచర్లు ఇవే...
ఐఫోన్ 16లో (iPhone 16) 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దీంతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ కూడా అందించారు.. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఐఫోన్ 16 సిరీస్ కంపెనీ లేటెస్ట్ ఐవోఎస్ 18తో లాంచ్ అయింది. ఐవోఎస్ 18 ద్వారా కొత్త మోడళ్లలో ఏఐ ఫీచర్లు యాపిల్ ఇంటెలిజెన్స్‌తో అందుబాటులోకి వస్తాయి. ఐవోఎస్ 18 ఫీచర్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి యూజర్లకు అందుబాటులోకి రానుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?